పేర‌డీ గార‌డీ : అదిరింద‌య్యా చంద్రం!?

Thursday, October 25th, 2018, 10:30:28 AM IST

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ..ద‌గ్గినా..తుమ్మినా…అంతా సోష‌ల్ మీడియానే ఆశ్ర‌యిస్తున్నారు. ఎక్క‌డ ఏది జ‌రిగినా క్ష‌ణాల్లో వీడియోల రూపంలో సోష‌ల్ మీడియాలో వ‌చ్చేస్తున్నాయి. ఇంత అలర్ట్‌గా వుండే సోష‌ల్ మీడియా సోపు బాబులు ఎల‌క్ష‌న్స్ వ‌స్తే కామ్‌గా వుంటారా.. మార్ఫింగ్ వీడియోల‌తో సోష‌ల్ మీడియాను పిచ్చెక్కంచ‌రూ? ఇప్ప‌డు అదే జ‌రుగుతోంది. తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్న‌క‌ల‌కు న‌గారా మోగ‌డంతో మార్ఫింగ్ రాయుళ్ల‌కు పండ‌గ మొద‌లైంది. దీంతో మార్ఫింగ్ ఫొటోలు..పేర‌డీ గార‌డీల‌ ఇంట్రెస్టింగ్ వీడియోల‌తో సోష‌ల్ మీడియాలో పెద్ద ర‌చ్చ‌కు తెర లేపారు.

ప్ర‌ధానంగా ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌కు చెందిన కీల‌క నాయ‌కుల‌ను ప్ర‌ధానంగా టార్గెట్ చేస్తూ హిట్ సినిమాల్లోని వీడియో బిట్‌ల‌ని, హిట్ సినిమా పోస్ట‌ర్‌ల‌ను మార్ఫింగ్, మిక్సింగ్‌ చేస్తూ ఓ రేంజ్‌లో హంగామా షురూ చేశారు. ముఖ్యంగా తెరాస ముఖ్య నాయ‌కుల‌ను మార్ఫింగ్ చేస్తూ వీడియోలు, పోస్ట‌ర్‌లు వెల్లు వెత్తుతున్నాయి. ఇందులో అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించిన `సింగం` సినిమాలోని ఓ యాక్ష‌న్ సీన్ ని మార్ఫింగ్ చేసిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాతో పాటు వాట్స‌ప్ గ్రూపుల్లో అత్య‌ధికంగా స‌ర్క్యులేట్ అవుతూ ఆక‌ట్టుకుంటోంది.

దేవ‌గ‌న్ `సింగం` త‌న ప్రేయ‌సిని ఆట‌ప‌ట్టించిన రౌడీ బ్యాచ్‌ను ఛేజ్ చేస్తూ చెడుగుడు ఆడుకునే స‌న్నివేశాన్ని బాగా మార్ఫింగ్ చేశారు. ఈ వీడియోలో బాజీరావ్ సింగంగా కేసీఆర్ రౌడీ బ్యాచ్‌గా మ‌హాకూట‌మి నేత‌లు చంద్ర‌బాబు నాయ‌డు, ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోదండ‌రామ్‌, టీటీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ ల‌ని చూపించడం వీరికి మాయాకూట‌మి అని పేరు త‌గిలించ‌డం ప‌లువురిని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. పైగా సింగం గెట‌ప్‌లో కేసీఆర్‌ని చూపించిన తీరు, కేసీఆర్‌ని చూసి భ‌యంతో చంద్ర‌బాబు పారిపోతున్న‌తీరు న‌వ్వులు పూయిస్తోంది. ఈ త‌ర‌హాలో కాంగ్రెస్, తేరాస‌, తేదేపా, కూట‌ముల‌పై తామ‌ర‌తంప‌ర‌గా ఫోటోలు, వీడియోలు ద‌ర్శ‌న‌మిస్తూ బోలెడంత కామెడీని పండిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments