పేర‌డీ పంచ్‌ : కాంగ్రెస్ స‌రికొత్త‌ ప్ర‌చారం

Tuesday, November 6th, 2018, 02:55:25 PM IST

తొమ్మిది నెల‌ల ప‌ద‌వీకాంల వుండ‌గానే తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దుచేసి కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు శంఖారావం పూరించిన విష‌యం తెలిసిందిఏ. గ‌త నాలుగున్న‌రేళ్లుగా ఇలాంటి త‌రుణం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ అందివ‌చ్చిన అవ‌కాశ‌న్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌న్న దిశ‌గా అడుగులు వేయ‌డం మొద‌లుపెట్టింది. తెదేపా, తెజ‌స‌, సీపీఐని జ‌ట్టుగా చేర్చుకుని మ‌హాకూట‌మి పేరుతో కూట‌మి క‌ట్టి దూకుడు పెంచింది. పొత్తుల చిక్కుల‌తో ఓ ప‌క్క స‌త‌మ‌త‌మ‌వుతూనే రాజ‌కీయ చ‌తుర‌త‌తో తెరాస‌ను ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.

ఇందులో భాగంగా ఏ వేదిక దొరికినా తెరాస‌ను ప‌తాక స్థాయిలో విమ‌ర్శిస్తున్న కాంగ్రెస్ నాయ‌కులు సోష‌ల్ మీడియాను కూడా బాగానే వాడేస్తున్నారు. అదీ కాకుండా సినీ క్లిప్పింగుల‌ను సైతం పేర‌డీ వీడియోల రూపంలో క్రియేట్ చేస్తూ ఓట‌ర్ల‌ని ఆక‌ట్టుకునే ప‌నిలోప‌డ్డారు. ఇటీవ‌ల అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించిన `సింగం` (సూర్య సింగం) చిత్రాన్ని మార్ఫింగ్ చేసి స్ఫూఫ్‌గా తెరాస వాడితే దానికి కౌంట‌ర్ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో కాంగ్రెస్ కుమ్మేస్తోంది. క‌ల్యాణ్‌రామ్ న‌టించిన `ప‌టాస్‌` చిత్రంలోని ఓ వీడియోను కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్ఫింగ్ చేయిచిన తీరు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో న‌వ్వుల పువ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో క‌ల్యాణ్‌రామ్‌గా ఉత్త‌మ్‌కుమార్ రెడ్డిని చూపిస్తే విల‌న్ బ్యాచ్‌గా కేసీఆర్, కేటీఆర్‌తో పాటు హ‌రీష్‌రావును కూడా బాగానే వాడేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ అవుతూ హాట్ గా మారిపోవ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల వేళ కొత్త ర‌కం క్రియేటివిటీ విక‌సించ‌డంపై సోష‌ల్ మీడియాలో హాట్ డిబేట్ న‌డుస్తోంది.