ఫోక్రాన్‌పై అన్నీ అబద్ధాలేనా?

Saturday, May 26th, 2018, 11:32:33 AM IST

ఫోక్రాన్ అణుప‌రీక్ష‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన `ప‌ర‌మాణు` ఈ శుక్ర‌వారం రిలీజై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.
జాన్ అబ్ర‌హాం క‌థానాయ‌కుడిగా క్రై అర్జ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ప్రేర‌ణ అరోరా నిర్మించిన ఈ చిత్రానికి 4 రేటింగ్ రావ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప్ర‌ఖ్యాత బాలీవుడ్ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ఈ సినిమాని ఆకాశానికెత్తేశారు. వ‌న్‌వ‌ర్డ్ రివ్యూలో 4 రేటింగుతో పొగిడేశాడు. భార‌త‌దేశంలో అణుబాంబ్ త‌యారీకి సంబంధించిన ర‌హ‌స్యాల్ని శత్రుదేశాల‌కు లీక్ చేయ‌డం అన్న ఆస‌క్తిక‌ర పాయింట్‌కు.. ఫిక్ష‌న్ జోడించి క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దార‌ని విమ‌ర్శ‌కులంతా పొగిడేశారు.

అయితే ఫిక్ష‌న‌ల్ స్టోరి కావ‌డంతో ఇందులో వాస్త‌వాల్ని య‌థాత‌థంగా చూపించ‌లేక‌పోయార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇక‌పోతే.. ఈ సినిమా ఆద్యంతం అద్భుత‌మైన స్క్రీన్ ప్లేతో క‌ట్టిప‌డేసేలా తెర‌కెక్కించార‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ముఖ్యంగా జాన్ అబ్ర‌హాం న‌టించిన క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా ఉంద‌న్న ప్ర‌శంస‌లొచ్చాయి. ప‌ర‌మాణు దాదాపు 2205 స్క్రీన్ల‌లో రిలీజైంది. ఇందులో 1935 స్క్రీన్లు ఇండియాలోనివి. విదేశాల్లో 270 స్క్రీన్ల‌లో రిలీజైంది.

  •  
  •  
  •  
  •  

Comments