సర్వం అమిత్ షా మయం అంటున్న స్వామీజీ !

Friday, October 19th, 2018, 02:44:15 PM IST

రాష్ట్రాల్లో తమకు అనుకూలమైన వ్యక్తుల్ని నాయకులుగా తయారుచేసి వారి ద్వారా తన పాలనను ఎలాంటి అడ్డూ లేకుండా చేసుకోవడం అనే పద్దతి అధికార బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. అందుకు నిదర్శనమే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మోగి ఆదిత్యనాథ్. గతేడాది మార్చిలో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన ఆయన ఇంతవరకు సొంతగా నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు. ఆయన చేసే ప్రతి పని వెనుక మోడీ, అమిత్ షాల ప్రోద్భలం తప్పకుండా ఉంటుంది.

ఇప్పుడు ఇదే తరహా ప్లాన్ ను తెలంగాణ మీద ప్రయోగిస్తోంది బీజేపీ. స్వామి పరిపూర్ణానందను తమ పార్టీలోకి లాగి, రాష్ట్ర ప్రచార సారధిగా, అవసరం అనిపిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టే యోచనలో కమలాధినేతలు ఉన్నారట. ఇప్పటికే ఒకసారి ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసిన పరిపూర్ణానంద ఆ మీటింగ్ తరవాత తన రాజకీయ ఆసక్తి తర్వాత సంగతని, ముందు అమిత్ షా మనోగతమే ముఖ్యమని, ఆయన ఆదేశాల మేరకు అన్నీ జరుగుతాయని, సర్వం అమిత్ షా మయం అన్నట్టు బీజేపీకి తన లొంగుబాటును ప్రకటించేశారు.

ప్రస్తుతం ఆయన అమిత్ షాతో రెండవ మీటింగ్ కోసం ఈరోజు ఢిల్లీ వెళ్లారు. ఈ సమావేశంతో అన్ని వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చి ఈరోజే అయన బీజేపీ పార్టీలో చేరిపోతారని తెలుస్తోంది. ఒకవేళ రాబోయే ఎన్నికల్లో అమిత్ షా ఊహించినట్టు బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపగలిగినా పరిపూర్ణానంద తెలంగాణకు యోగి ఆదిత్యనాథ్ కావడం ఖాయం.

  •  
  •  
  •  
  •  

Comments