అమ్మ చెప్పిందని బీజేపీలో చేరాడట స్వామీజీ !

Thursday, October 25th, 2018, 01:10:04 PM IST

స్వామి పరిపూర్ణానంద బీజేపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో పాగా వేయాలని బాగా ఆలోచించిన బీజేపీకి ఎవరూ దొరక్కపోగా ఈ స్వామీజీయే దిక్కయ్యాడు. ప్రజల్లో మంచి పాపులారిటీ ఉన్న ఈ పరిపూర్ణానంద కూడ మొదటి నుండి బీజేపీకి తగిన వేవ్ లెంగ్త్ లోనే ఉన్నారు. అమిత్ షాతో మొదటి మీటింగ్ పూర్తైన మరుక్షణమే తనని తాను పార్టీకి అర్పించేసుకున్న పరిపూర్ణానంద అమిత్ షా ఎలా చెబితే అలా నడుస్తానని అప్పుడే అనౌన్స్ చేసేశారు.

తాజాగా ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన కేవలం ప్రవచనాలతో చైతన్యం సాధ్యం కాదని తెలుసుకున్నానని, అందుకే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. బాగా ఆలోచించిన స్వామీజీ ఏ పార్టీలో చేరితే బాగుంటుందని వాళ్ళ అమ్మను అడగ్గా ఆమె బీజేపీలో చేరమని సలహా ఇచ్చారట, ఆయన గురువుగారు కూడ ఇదే సలహా ఇచ్చారట. దీంతో ఆయన కమల కండువా కప్పుకున్నారట.

అంతేకాదు ఇన్నాళ్లు తాను ఎవరికోసమైతే పనిచేశానో ఆ బడుగు బలహీన వర్గాల్లో సమానత్వం ఆయన కనిపించలేదని, ఆ సమానత్వాన్ని సంపాదించడం కోసమే బీజేపీలో చేరానని, బీజేపీ వలనే ఆ సమానత్వం సాధ్యమని ఆయన అంటున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు మాత్రం బీజేపీ తమ అభ్యున్నతికి ఏ కోశానా తోడ్పడలేదని గుండెలు బాదుకుంటున్నాయి. ఇప్పటివరకు ఏ దళిత వర్గం కానీ, వెనకబడిన తెగలు కానీ మోడీ తమకు మంచి చేశాడని చెప్పిన దాఖలాలు లేవు. పైగా కొన్ని చోట్ల హిందూత్వ శక్తుల్ని ప్రోత్సహిస్తుందనే ఆరోపణలు కూడ బీజేపీపై బలంగా ఉన్నాయి. అలాంటిది స్వామీజీకి బీజేపీలో సమానత్వ ధోరణి ఎక్కడ కనిపించిందో అర్థం కావడంలేదు.

  •  
  •  
  •  
  •  

Comments