ఇట్స్ అఫిషియ‌ల్.. బీజేపీలో చేరిన స్వామి పరిపూర్ణానంద..!

Saturday, October 20th, 2018, 04:19:38 AM IST

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి తాజాగా బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ‌ అధ్య‌క్షుడు అమిత్ షా స‌మ‌క్షంలో ఆయ‌న కమ‌లం తీర్ధం పుచ్చుకున్నారు. గ‌త కొద్దిరోజులుగా పరిపూర్ణానంద స్వామి బీజేపీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో అమిత్ షా, రాంమాధ‌వ్ ల‌తో స‌మావేశం అయ్యి ఒక నిర్ణ‌యానికి వ‌చ్చి తాజాగా బీజేపీ కండువా క‌ప్పుకున్నారు. బీజేపీ అధిష్టానం.. పరిపూర్ణానంద స్వామిని.. తెలంగాణ సీయం అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దించ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌ధ్యంలో పరిపూర్ణానంద స్వామి వ‌చ్చే ఎన్నిక‌ల్లో జూబ్లీహిల్స్ నియోజ‌కవ‌ర్గం నుండి పోటీ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

ఇక ఈ నేప‌ధ్యంలో ఆయ‌న మాట్లాడుతూ.. బీజేపీ సిద్ధాంతాలు న‌చ్చే ఆ పార్టీలో చేరాన‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి మాత్రంమే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నానని.. ఆధ్యాత్మిక మార్గంల‌తో ఎంత త్రిక‌ర‌ణ‌శుద్ధిగా ప‌నిచేశానో.. రాజ‌కీయాల్లో కూడా అంతే చిత్ర‌శుద్ధితో ప‌ని చేస్తాన‌ని.. ప్ర‌దాని న‌రేంద్ర‌మోదీ,అమిత్ షా, రాంమాధ‌వ్ మార్గ‌నిర్దేశంలో ఇర‌వై నాలుగు గంట‌లూ ప‌ని చేస్తాన‌ని.. అవ‌స‌రం అయితే దేశంలో ఉన్న ప్ర‌తి గ్రామానికి వెళ‌తాన‌ని.. అక్క‌డ వారికి బీజేపీ సిద్ధాంతాలు వివ‌రించి పార్టీకి వ‌న్నె తెస్తాన‌ని పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఇక బీజేపీ కుటుంబంలో తాను కూడా భాగ‌మైనందుకు చాలా సంతోషంగా ఉంద‌ని పరిపూర్ణానంద స్వామి అన్నారు. దీంతో పరిపూర్ణానంద స్వామి బీజేపీలో చేర‌డం దేశ‌రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments