టీడీపీకి ఊహించని షాక్ ఇచ్చిన.. ప‌రిటాల అనుచ‌రుడు..!

Monday, November 12th, 2018, 02:59:14 PM IST

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి.. అనంత‌పురం జిల్లాలో ఊహించ‌ని షాక్ త‌గిలింది. తాజాగా ప‌రిటాల అనుచ‌రుడు రేగాటిప‌ల్లి మ‌ధుసూధ‌న రెడ్డి పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి ఒక్క‌సారిగా అనంత రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్‌టాపిక్ అయ్యాడు. ఈ సంధ‌ర్భంగా ధ‌ర్మ‌వ‌రంలో మీడియా ముందుకు వ‌చ్చిన మ‌ధుసూద‌న్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్లే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన‌ట్లు పేర్కొన్నారు.

ఇక అధికార తెలుగుదేశం పార్టీతో తనకు 26 సంవత్సరాల అనుబంధముందని.. బ‌ద్ద‌ శ‌త్రువైన కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపెట్టుకోవ‌డం త‌న‌ని తీవ్రం మ‌న‌స్థాపానికి గురి చేసింద‌ని.. అందుకే ఇలా ఖ‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నాన‌ని ముధుసూద‌న్ రెడ్డి అన్నారు. ఇక తాను సింగిల్‌విండో అధ్యక్షుడిగానూ.. స‌ర్పంచ్‌గానూ ప‌నిచేశాన‌ని తెలిపిన మ‌ధుసూద‌న్ రెడ్డి కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చించి ఏ పార్టీలో చేరేది ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు. కాగా మ‌ధుసూద‌న్ రెడ్డి జ‌న‌సేన‌లో చేర‌నున్నారని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏది ఏమైనా ప్ర‌రిటాల అనుచ‌రుడు రాజీనామాతో అక్క‌డ టీడీపీకి పెద్ద షాకే అని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.