వైఎస్ఆర్సిపీ మంత్రి విజయ్ సాయికి పరిటాల సునీత ఎందుకు సలహాలిస్తుంది..?

Friday, March 30th, 2018, 05:13:02 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా, అవిశ్వాస తీర్మానంకి సంబందించిన అల్లర్లు చలరేగుతున్న సమయంలో ఇటు టీడీపీ అటు వైఎస్ఆర్సిపీ పార్టీలు ఒకరినొకరు అనుచిత మాటలనుకుంటున్నారు. ఇటివల ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ మంత్రి విజయసాయి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై పెద్ద గొడవలే జరుగుతున్నాయి. టీడీపీ పార్టీ శ్రేణులు ఈ మాజీ ఆడిటరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అలాగే దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పరిటాల సునీత తీవ్ర స్థాయిలో స్పందించారు. “పరిటాల రవి గురించి ఏమి తెలుసని వంద హత్యలు చేశాడని అంటున్నావు. నువ్వు ఎప్పుడైనా చూసావా అని ఆయన గురించి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా అడుగు.. చెబుతారు. చదువుంటే చాలదు.. సంస్కారం కూడా ఉండాలి. అది తెలుసుకొని ఇకనైనా మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమని సలహా ఇచ్చారు.

ఇదిలాగుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆమె మాట్లాడుతూ.. “11 కేసుల్లో నిందితుడిగా ఉండి 16 నెలలు జైలుశిక్ష అనుభవించిన నీకు చంద్రబాబును విమర్శించే అర్హత ఉందా? ఆయన కాలి గోటికి కూడా సరిపోవు. వైసీపీ దొంగల పార్టీ. మీరంతా దొంగలు. పత్రిక, చానల్‌ను అడ్డుపెట్టుకుని లేనిపోని అబద్ధాలు రాస్తున్నారు. నీ మాటలతో రాష్ట్రంలో ప్రతి తల్లి గుండె అల్లల్లాడుతుంది “ అంటూ ఆవేదనగా మాట్లాడారు. అటు పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఆయనకు ఎవరిని గౌరవించే అలవాటు లేదని ప్రధాని కాళ్ళ మీద పడి రాష్ట్రాన్ని వాళ్ళ కాళ్ళ కింద పెట్టారని విమర్శిస్తున్నారు. ఈ వివాదాస్పద చర్చలు ఎంతవరకు దారితీస్తాయో అని ప్రజలు కూడా తీవ్రంగానే ఆలోచిస్తున్నారు.