ఇక్కడే ఉంటే తంతా.. పరిటాల సునీత వార్నింగ్!

Monday, July 23rd, 2018, 06:49:50 PM IST

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం అన్న క్యాంటిన్ లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రాష్ట్రమంతటా ఈ పథకాన్ని టీడీపీ అధినేతలు విస్తరింపజేస్తున్నారు. రీసెంట్ గా అనంతపురంలోని బైపాస్ రోడ్డులో మంత్రి పరిటాల సునీత ‘అన్న క్యాంటీన్’ను తనిఖీ చేయగా అక్కడ ఒక ఘటన చోటుచేసుకుంది. మంత్రి క్యాంటిన్ నిర్వాహకులపై మండిపడుతూ ఓ పిల్లవాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంటిన్ లో ప్లేట్లు అందిస్తున్న ఒక పిల్లవాడిని చూసి.. ఏరా? బడికి పోలేదా? ఇంకా ఇక్కడే ఉంటే తంతా అని వార్నింగ్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. చిన్నారులను పనిలో పెట్టుకోకూడదని అక్కడి నిర్వాహకులను సునీత హెచ్చరించారు. అనంతరం అక్కడ ఆహార నాణ్యత గురించి అలాగే వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments