పరిటాల సునీత సంచ‌ల‌నం.. జ‌గ‌న్ కావాల‌నే పొడిపించుకున్నాడ‌ట‌..!

Saturday, October 27th, 2018, 04:35:55 PM IST

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులో హ‌త్యాయ‌త్నంలో భాగంగా క‌త్తితో దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఘ‌ట‌న పై టీడీపీ నేత‌లు జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు సాగిస్తూనే ఉన్నారు. తాజాగా మంత్రి ప‌రిటాల సునీత జ‌గ‌న్ ఘ‌ట‌న పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ కావాల‌నే క‌త్తితో పొడుచుకున్నార‌ని.. ఏదో పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డిన‌ట్టు సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నాడ‌ని మంత్రి సునీత వ్యాఖ్యానించారు.

ఇక అంత‌టితో ఆగ‌ని సునీత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడే ప‌రిటాల ర‌విని ప‌ట్ట‌ప‌గ‌లే హత్య‌చేశార‌ని ఆరోపించారు. అప్పుడు త‌న భ‌ర్త ఎమ్మెల్యేగా చ‌నిపోతే నాటి గ‌వ‌ర్న‌ర్ వ‌చ్చి ప‌లుక‌రించ‌లేద‌ని.. చంద్ర‌బాబు ఒక్క‌రే త‌మ‌ను ఆదుకున్నార‌ని సునీత తెలిపారు. ఇక జ‌గ‌న్ మూడువేల కిలో మీట‌ర్లు పాద‌యాత్ర చేసినా త‌న‌కు ఎలాంటి ప్ర‌మాదం జ‌రుగ‌లేద‌ని.. అయితే ఎయిర్‌పోర్టులో జ‌గ‌న్ పై దాడి జ‌రిగితే రాష్ట్ర ప్ర‌భుత్వానికి సంబంధం ఎలా ఉంటుంద‌ని సునీత ప్ర‌శ్నించారు. వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నార‌ని.. రాష్ట్రంలో అల్ల‌ర్లు సృష్టించ‌డ‌మే ల‌క్ష్యంగా వైసీపీ శ్రేణులు మాట్లాడుతున్నార‌ని.. సునీత వ్యాఖ్య‌లు చేశారు. మ‌రి ప‌రిటాల సునీత వ్యాఖ్య‌ల పై వైసీపీ ఎలా స్పందిస్తారో చూడాల‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments