షాకింగ్ – పార్థసారథి సంచలనం – పవన్ కళ్యాణ్ కి జగన్ తో కలవాలని కోరిక…!

Sunday, January 13th, 2019, 01:12:26 AM IST

వైస్సార్సీపీ నేత పార్థ సారథి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. పవన్ పొత్తుల కోసం ఇదివరకు చేసిన వాఖ్యలను ఆధారంగా చేసుకొని పార్థసారథి కొన్ని సెటైర్లు వేశారు. పవన్ మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒకటి మాట్లాడుతున్నాడు. అది చాలా తప్పు. అసలు విషయానికి వస్తే పవన్ కి వైస్సార్సీపీ అధినేత జగన్ తో కలిసి పొత్తు పెట్టుకోవాలని ఆశగా ఉందని, ఆ మాటని పవన్ బయటికి చెప్పలేకపోతున్నారని పార్థసారథి అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పవన్ వాఖ్యలపైనా స్పందిస్తూ ఎద్దేవా చేశారు.

పవన్ కి ఎస్సార్సీలో తో కలిసి పని చేయాలనీ కోరికగా ఉందని, అసలు వైస్సార్సీపీ తో కలిసి పని చేయమని పవన్ కి ఎవరో తెరాస నేత సలహా ఇచ్చారని ఆయన ఆరోపించారు. అందుకని పవన్ ఇంతలా మొగ్గు చూపుతున్నాడని అన్నారు. మా వైస్సార్సీపీ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదు. మేము ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని పార్థసారథి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోవడానికి చంద్రబాబు నాయుడు మానసికంగా అన్ని విధాలా సిద్ధపడ్డారని, ఈ ఎన్నికల్లో జగన్ అఖండ విజయం సాదించబోతున్నారని పార్థసారథి స్పష్టం చేశారు. మీరెన్ని అభియోగాలు చేసిన కూడా ప్రజలు ఇక మిమ్మల్ని నమ్మరని, ప్రజలు అందరు కూడా జగన్ కి పట్టం కట్టడానికి ఎప్పుడో సిద్ధమయ్యారని తెలిపారు.