రేవంత్ కి పార్టీ కీలక భాద్యతలు…

Tuesday, November 20th, 2018, 09:49:35 PM IST


నామినేషన్ ప్రక్రియ పూర్తైనప్పటినుండి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారంలో భాగంగా యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈ నెల 23న తెలంగాణకు వస్తున్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ లో నిర్వహించే బారి బహిరంగ సభకి సోనియా గాంధీ హాజరై, ఆ సభ లో ప్రసంగిస్తారు. దీనికోసం ఏర్పాట్లు చేయడానికి రేవంత్ రెడ్డి కి పార్టీ అధిష్టానం బాధ్యతలని అప్పజెప్పింది. ఈ నేపథ్యంలో రేవంత్ మేడ్చల్ లోని సభా స్థలానికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోనియాగాంధీ టూర్ కి ఎంతో ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కలను సోనియా గాంధీ నెరవేరిస్తే, ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందన్నారు.
తెలంగాణా ఇచ్చిన సోనియా గాంధీ గారికి కృతఙ్ఞతలు తెలిపేందుకు ప్రజలు రెడీ గా ఉన్నారని, ఈసారి కూటమి అధికారం లోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి అన్నారు. దొంగ నాయకులు అయినా కేసీఆర్ కుటుంబం చేసిన నాలుగేళ్ల పాలనకు ప్రజలు వేసే మార్కులు సున్నా అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. త్యాగాలు ప్రజలవైతే.. భోగాలు కేసీఆర్‌వి అని ఆయన విమర్శించారు. ప్రగతి భవన్‌ను కేసీఆర్ పైరవీ భవన్‌గా మార్చేశారని, కేసీఆర్ కుటుంబంతో బందీ అయిన తెలంగాణకు విముక్తి కావాలని, డిసెంబర్ 7 లోపు రెండు వికెట్లు పడడం ఖాయమని రేవంత్ అన్నారు. తెరాస కి ఈసారి డిపాజిట్లు కూడా దొరకవని రేవంత్ ఎద్దేవా చేసారు,