నీవెనుక జనశక్తి వుంది: పరుచూరి

Sunday, April 22nd, 2018, 03:11:04 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గత కొంత కాలంగా వ్యక్తిగతంగా దెబ్బ కొట్టడానికి చాలా పెద్ద కుట్ర జరుగుతోంది అనే విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. పవన్ కూడా చాలా కాలం తరువాత తనపై వస్తోన్న ఆరోపణల గురించి పెద్దగా స్పందించలేదు. కానీ ఎప్పుడైతే తన తల్లిని కించపరిచే విధంగా అసభ్యకరమైన పదజాలాన్ని వాడారో అప్పటి నుంచి పవన్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇకపోతే ప్రస్తుతం పవన్ చేస్తోన్న పోరాటానికి సినీ పరిశ్రమ పెద్దల నుంచి మద్దతు లభిస్తోంది.

రీసెంట్ గా సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ పవన్ కు మద్దతు తెలుపుతూ ట్వీట్స్ చేశారు. నిన్న పరుచూరి చేసిన ట్వీట్ పవన్ కి ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ లో చూపించారు. ‘పవన్ కల్యాణ్ తన భద్రత కోసం ప్రభుత్వం ఇచ్చిన 2 ప్లస్ 2 గన్ మెన్ సౌకర్యాన్ని వదులుకున్నాడట.. ప్రతి జన సైనికుడూ తనకు ఒక గన్‌మెనే కదా.. దమ్ముతో దుమ్ము రేపేవాళ్లు వెనక్కి తిరిగి చూడరు. వెనక చూపు చూసుకోడానికి వెంట జనసైన్యం ఉంది, ఆ పక్క ఈ పక్క వామపక్షాలున్నాయి. ప్రశ్నించడమే గెలుపుగా సాగిపో’ అంటూ పరుచూరి చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.

ఇక ఆ ట్వీట్ ను చూసి పవన్ నవ్వారని మరో ట్వీట్ చేశారు. ‘నిన్న ఛాంబర్ లో పవన్ ని కలిసినప్పుడు గన్ మెన్ల మీద పెట్టిన ట్వీట్ చూపించా.. ఉపన్యాసం మధ్యలో నవ్వుతాడే అలాగే నవ్వి కరచాలనం చేశాడు. న్యాయ పోరాటం కోసం ముందడుగువేయ్ పవన్.. నీవెనుక జనశక్తి వుంది’ అని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments