ఇట్స్ అఫిషియ‌ల్.. కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. జనసేనలో చేరిన‌ మాజీ మంత్రి..!

Saturday, November 10th, 2018, 03:00:32 PM IST

ఏపీ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఈ శ‌నివారం జ‌న‌సేన తీర్ధం పుచ్చుకున్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తూ.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ పంపించారు. ఈ క్ర‌మంలో విజ‌య‌వాడ‌లోని పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ స‌మ‌క్షంలో జ‌న‌సేన పార్టీ కండువా క‌ప్పుకున్నారు.

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన బాల‌రాజు.. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించే అవకాశం కల్పించిన కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. త‌న‌ అనచరులు, సన్నిహితుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాన‌ని ప‌సుపులేటి తెలిపారు. ఇక అధికారం కోసం కాకుండా సమాజంలో మార్పు కోసం పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారన్నారని ఈ మాజీ మంత్రి అన్నారు. అవినీతి ర‌హిత స‌మాజం కోసం ఏపీ ప్ర‌జ‌ల‌కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ ఉధ్య‌మాన్ని ప్రారంబించార‌ని.. ఆ ఉధ్యమంలో తాను కూడా భాగ‌స్వామి అయ్యేందుకే జ‌న‌సేన‌లో చేరిన‌ట్లు బాల‌రాజు తెలిపారు. ఇక మాజీ మంత్రి ప‌సుపులేటి బాల‌రాజు చేరిక‌తో జ‌న‌సేన మ‌రింత బ‌లోపేతం అయ్యింద‌ని ప‌వ‌న్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

  •  
  •  
  •  
  •  

Comments