72 గంటలు రైలు ప్రయాణం చేసిన శవం!

Wednesday, May 30th, 2018, 02:23:06 PM IST

ప్రస్తుత రోజుల్లో జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే ఆశ్చర్యం కలగకుండా ఉండదు. రీసెంట్ గా ఒక వ్యక్తి మృతదేహం రైల్లోనే మూడు రోజుల వరకు ఉండడం అందరిని షాక్ కి గురి జేసింది. దాదాపు 15 వందల కిలోమీటర్లు ఆ మృతదేహం ప్రయాణించింది. రైల్లో ప్రయాణికులు గాని అధికారులు గాని అలాగే రైలు శుభ్రం చేసే పారిశ్యుద్య కార్మికులు గాని పట్టించుకోలేదు. పాట్నాలో జరిగిన ఈ ఘటన అందరిని షాక్ కి గురి చేసింది.

అసలు వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ కు చెందిన సంజయ్ కుమార్ అనే వ్యక్తి ఆగ్రాలో పెళ్లికి వెళ్లేందుకు ఈ నెల 24న ఉదయం ఆరు గంటలకు పట్నా-కోటా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కారు. అయితే అతని ఆరోగ్యం బాగోలేదని భార్య తరచు ఫోన్ చేస్తుంటుంది. అదునులో భాగంగానే రైలు ఎక్కినా గంటన్నర తరువాత ఫోన్ చేయగా సంజయ్ కొంచెం నలతగా ఉందని నెక్స్ట్ స్టేషన్ లో అవసరం అయితే దిగేస్తాను అని చెప్పాడు. సంజయ్ నుంచి వచ్చిన చివరి మాటలు అవే.

మళ్లీ భార్య ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. ఆగ్రాకు వెళ్లలేదని తెలుసుకున్న భార్య రైల్వే అధికారులకు ఫోన్ చేసింది. చివరగా 72 గంటల ముందు భార్యతో ఫోన్ మాట్లాడినట్లు తెలుసుకున్న రైల్వే పోలీసులు అతన్ని వెతికే పనిలో పడ్డారు. అయితే ఇంతలో రైల్వే సిబ్బంది లో కొందరు పట్నా-కోటా ఎక్స్‌ప్రెస్‌ రైలులో దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు. రైలు బాత్రూమ్ దగ్గరికి వెళ్లగా అక్కడ మరింత దుర్వాసన రావడంతో తలుపు తీయడానికి ప్రయత్నించగా రాలేదు.

చివరకు బద్దులు కొట్టడంతో అందులో మృతదేహం ఉందని తెలుసుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో అతని దగ్గర ఉన్న ఓ ఐడి కార్డు ప్రకారం సంజయ్ కుమార్ అని తెలుసుకున్నారు. బాత్రూమ్ లోకి వెళ్లగానే గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు తెలుసుకున్నారు. దాదాపు 72 గంటల పాటు ఎవరు గమనించకపోవడంతో మృతదేహం కుళ్లిపోయింది. అయితే రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments