మోడీ కి పవన్ చురకలు!

Thursday, March 15th, 2018, 01:00:58 AM IST

జనసేన పార్టీ ఆవిర్భావ సభలో భాగంగా ప్రసంగిస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ మొదట తాను ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే ఆనాడు టిడిపి కి, కేంద్ర బిజెపి కి మాడత్తు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని అత్యంత దారుణంగా విభజించారనిఅన్నారు .రాష్ట్ర విభజన సమయంలో మోడీ గారు మీరు కూడా ఒప్పుకుంటేనే విభాజన జరిగింది కదా అన్నారు. అంతేకాక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎలా ఎంత మంది త్యాగధనుల శ్రమ వల్ల ఇచ్చారో అలానే ఆంధ్ర లో కూడా ఇక్కడ ప్రజల, నాయకుల కష్టాలు కనపడలేదా అన్నారు.

అలానే ప్రభుత్వం ఏర్పడిన సమయంలో ప్రత్యేక హోదా పదిహేను సంవత్సరాల పాటు ఇస్తానన్న మోడీ వున్నట్లుండి ప్రత్యేక ప్యాకేజి ఇస్తామన్నారు. అయితే అది కూడా ఇప్పటివరకు ఏమాత్రం అమలు చేయలేదన్నారు. అయినా మేము మాత్రం కోరుకునేది ప్రత్యేక హోదా కోసమే. హోదా వల్లనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని అన్నారు. అయ్యా మోడీ గారు మా రాష్ట్రం లో వున్న 5 కోట్ల మంది ప్రజలను మీరు కేవలం 25 మంది ఎంపీ లతో ఎలా కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు అని ఉద్వేగంగా మాట్లాడారు. అయితే సభలో కొందరు సీఎం అని అరుస్తుంటే దానికి పవన్ బదులిస్తూ, ఎన్నాళ్లకు సీఎం, ఎన్నేళ్లకు సీఎం. నాకు సీఎం కంటే ప్రజలే నాకు ముఖ్యం అని గట్టిగా చెప్పారు…