బీజేపీలో చేరిన పవన్ ఫ్యాన్!

Sunday, May 6th, 2018, 07:59:32 PM IST


ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నటి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఫిలిం ఛాంబర్ ఎదుట మౌన దీక్ష చేపట్టిన నటి మాధవీలత, నిన్న అనూహ్యంగా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఒక కార్యక్రమంలో భాగంగా నేడు హైదరాబాద్ విచ్చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ఆమె బిజెపి లో చేరారు. నితిన్ గడ్కరీ ఆమెను తమ పార్టీ కండువాతో పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తాను పవన్ కు పెద్ద అభిమానినని, ఆయనంటే ఇష్టం ఎప్పుడు అలానే ఉంటుందని అన్నారు. ఇదివరకు తాను కొంత జనసేనకు మద్దతు పలికిన మాట వాస్తవమని, అయితే తానెప్పుడూ జనసేనలో చేరుతానని ప్రకటించలేదని చెప్పుకొచ్చారు.

గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారి ఐడియాలజీ, విధానాలు నచ్చి బిజెపికి ఎలా మద్దతిచ్చారు తానుకూడా అంతే అని చెప్పింది. అంతే కాదు పవన్ విషయంలో తాను మౌన దీక్ష చేస్తే మీడియా ఫోకస్ చేసిందని, అదే మొన్న అతి కిరాతకంగా లైంగిక దాడికి బలైన అసిఫా కోసం చేపట్టిన ర్యాలీ పై మాత్రం మీడియా శ్రద్ధ చూపలేదని ఆమె విమర్శించింది. ఏదిఏమైనా మోడీ లాంటి ఒక గొప్ప వ్యక్తి సారథ్యం మన దేశానికి అవసరమని, ఆయన అడుగుజాడల్లో నడవాలని ఈ పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు…..

  •  
  •  
  •  
  •  

Comments