ఈ శాపాల గోలేంటి పవన్..?

Tuesday, November 6th, 2018, 03:36:11 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రవర్తనలో మార్పు వాచినట్టు కన్పిస్తుంది. కొంత కలం ఆవేశంగా, కొంత కాలం ఆలోచింపచేసేలా మాటాడే ఆయన, ఇప్పుడు తన మాట తీరు పూర్తిగా మార్చేశారు. తనకు కోపం ఉన్నవాళ్ళ పై షాపుల మీద శాపాలు పెట్టేస్తూ ఆశ్చర్యపెడుతున్నారు, మొన్న యూపీ నాలుగు ముక్కలు కావాలంటూ శపించారు. ఆ రాష్ట్రాన్ని చూసుకొనే బీజేపీ వారు చెలరేగిపోతున్నారని, ఆ రాష్ట్రం ముక్కలైపోతే వాల్ల గర్వం అనిగిపోతుందంటూ శపించారు.

కొత్తగా ఈ శాపాలు పెట్టే అలవాటేంటో గాని, పవన్ మరోసారి అదే రేంజ్ లో శాపాలు పెట్టారు, ఈ సారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు శాపం పెట్టారు, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం లో జరిగిన బహిరంగ సభలో మాటాడుతూ పవన్ చంద్రబాబుపై, అయన తనయుడు లోకేశ్ పై, టీడీపీ నాయకుల పై శాపం పెట్టారు. పాపం పండితే ఎవరైనా చింతకాయల్లా రాలిపోతారన్నారు, చంద్రబాబు కూడా చింతకాయలా రాలిపోయే టైం వచ్చిందని, ఆయన పాపం పండిందని అన్నారు. అదే రీతిలో టీడీపీ నాయకులందరి పాపలు పండి త్వరలోనే చింతకాయల్లా రాలిపోతారని, దీపావళి టపాసుల్లా పేలిపోతారని అన్నారు.

తనని విమర్శిస్తూ ట్వీట్ చేసిన లోకేష్ పై కూడా అదే స్థాయిలో మండి పడ్డారు పవన్. తితిలి తుఫాను బాధితులకు ఇచ్చే చెక్కుల పైన చంద్రబాబు ఫోటో వేయటం ఏంటి అంటూ ప్రశ్నించారు. బాధితులకు చంద్రబాబు జేబులోని డబ్బు ఇవ్వటం లేదని, అది హెరిటేజ్ డబ్బు అంతకన్నా కాదని, చెక్కు పై ఫోటో ముద్రించేందుకు చంద్రబాబు ఏమైనా మహాత్మా గాంధీ అంతటి వాడా? అంటూ తనదైన శైలిలో విరుచుకపడ్డారు. మరి చంద్రబాబు అండ్ కో పవన్ శాపాలకు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments