టీడీపీ ప్రభుత్వ భూసేకరణపై నిప్పులు చెరిగిన పవన్!

Thursday, May 17th, 2018, 07:04:14 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుమల పర్యటన చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆయన చిత్తూర్ జిల్లాలో పర్యటిస్తూ అక్కడి ప్రజల కష్టనష్టాలు అడిగితెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా అయన నేడు చిత్తూర్ జిల్లా శెట్టి పల్లి గ్రామ ప్రజలను కలుసుకున్నారు. పవన్ రాకతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు, ముఖ్యంగా రైతులు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ కార్యక్రమంపై ఆయనకు వివరించారు. తమకు ఇష్టం లేకున్నా టీడీపీ ప్రభుత్వ పెద్దలు తమనుండి భూములను స్వాధీనం చేసుకుంటున్నారని, మీరు మాకు అండగా నిలవాలని విన్నవించారు. దీనిపై స్పందించిన పవన్, టీడీపీ నేతలపైనా, ముఖ్యమంత్రి చంద్రబాబు పైనా తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇప్పటికే ప్రజలు నానా కష్టాలంతో అల్లాడుతుంటే, ఈ భూసేకరణ కార్యమ్రమం పెట్టి అమాయకుల భూములు ప్రభుత్వం అధర్మంగా, అన్యాయంగా లాక్కుంటోందని అన్నారు. ఇందరు రైతుల పొట్టలు కొట్టి ఆ కార్యక్రమం చేపట్టడం సరైనది కిరాదన్నారు. అయినా వేల కోట్లు దండుకుంటున్న టీడీపీ పెద్దలు కేవలం ఈ ప్రాంతంలోని ఆరు వందల ఎకరాలను వదిలిపెట్టలేకపోయారా అని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. అయినా వున్నవారికి ఒక నీతి, సామాన్య రైతులకు మరొక నీతా బాబు గారు అని అన్నారు.

ఒకనాడు ప్రజలు, రైతుల మేలుకోసం నేను టీడీపీ కి మద్దతిచ్చాను, కానీ ఇప్పుడు వారే ఈ విధంగా రైతులను పలువిధాలుగా హింసించడం చూస్తుంటే ఆనాడు అలాచేసి తప్పుచేసాను అనిపిస్తోంది అన్నారు. ఒకప్పుడు రైతులకు అండగా వుంటాను అని మాట ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వారి భూములనే లాక్కుంటుంటే తాము తిరిగి ఎందుకు ప్రశ్నించకూడదని మండిపడ్డారు. ఇప్పటికే టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మా పార్టీని అణచివేయాలని చూస్తున్నారు, అయినా పర్లేదు పార్టీకి నష్టం జరిగితే వేరే విధంగా పరిష్కరించుకుంటాను, అదే ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు…..

Comments