బాబు సొంత జిల్లాలో పవన్ పాగా !

Monday, April 23rd, 2018, 04:54:07 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు వదిలి రాజకీయాలపై పూర్తిగా తన దృష్టిని కూడఁరీకరించారు. అయితే ఆయన పార్టీ ని స్థాపించిన తర్వాత తొలి సారి రానున్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే పవన్ గురించి బాగా తెలిసిన దగ్గరి వారు, ఆయన చాలా మృదు స్వభావి అని , షూటింగ్ సెట్ లో వున్నపుడు చాలా సరదాగా ఉంటారని, ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే సంయమనంతో వ్యవహరిస్తారని అంటుంటారు. అంతేకాదు తనవద్దకు వచ్చిన వారిని ఆయన వొట్టి చేతులతో పంపరని, తన దగ్గర వున్నా దాన్లోనే ఎంతో కొంత ఇచ్చి పంపుతారని చెపుతుంటారు. పవన్ పైకి ఎంత గంభీరంగా కనపడినప్పటికీ అన్యాయం, అవినీతి, అధర్మాన్ని పవన్ సహించలేరు. ఇదివరకు కూడా ఒక సారి డెక్కన్ క్రానికల్ పత్రికలో తనపై తప్పుగా రాసినందుకు ఆ పత్రిక ఆఫీస్ ముందు ఆయన ధర్నా చేపట్టిన విషయం అందరికి గుర్తు వుండే ఉంటుంది.

ఒకప్పుడు నాగ బాబు మాట్లాడుతూ వాడి ప్రవర్తన బాగుంటుంది, కాకపోతే వాడి మనసు ఎవరికి అర్ధం కాదు అంటుండేవారు. ఒక వర్డ్ రోబ్ లో చాలా జతల బట్టలు ఉంటే, అందులో కేవలం ఒక నాలుగు, లేదా ఐదు జతల బట్టలు మాత్రమే వుంచుకునేవారని, ఎందుకురా అలా చేసావ్ అంటే, అలా తక్కువ జతలు ఉంటే ఎప్పుడు ఏమి వేసుకోవాలన్న ఆలోచన గట్టిగా ఉంటుంది అని చెప్పేవారని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించాక మాత్రం ఆయన మరింత ముక్కు సూటిగా వ్యవరించడం మొదలెట్టారు. తాను అప్పట్లో టీడీపీ కి మద్దతు ఇవ్వదని ప్రధాన కారణం, వారి ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంది అని తలంపుతోనే అని చెప్పారు. అయితే ప్రస్తుతం తాను అనుకున్న రీతిన కాకుండా, టిడిపి నేతలు, కార్యకర్తలు అవినీతి, అధర్మ కూపం లో మునిగిపోయారని ఆయన విమర్శించడం చూసాము. అయితే నేడు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ, చిత్తూర్ జిల్లలో తాను చేపట్టబోయే నాలుగు రోజుల పర్యటన విశేషాలను నేటి సాయంత్రం తెలియచేస్తాను అన్నారు.

వాస్తవానికి చంద్రబాబు ఈ నెల 30న ఆ జిల్లా తిరుపతి లో భారీ ఎత్తున దీక్ష చేపట్టబోతున్న విషయం తెలిసిందే. మరి పవన్ ఈ సమయంలో ఇటువంటి ప్రకటన చేస్తున్నారట అది ఖచ్చితంగా చంద్రబాబుకు చెక్ పెట్టడానికే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే చంద్రబాబు దీక్ష చేపట్టే రోజునే పవన్ కూడా అటువంటి కార్యక్రమం ఏదైనా చేస్తారేమో అని పలువురు అనుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ఒకేసారి రెండు కార్యక్రమాలను మీడియా ఎలా కవర్ చేస్తుంది అనే ఒక వాదన వినిపిస్తోంది. అసలే కొన్ని మిడియా చానెల్స్ పై తనదైన శైలిలో విరుచుకు పడుతున్న పవన్ ఒకవేళ తిరుపతిలో ఏమైనా కార్యక్రమ చేపడితే ఏ మేరకు తమ కవరేజీ ని అందిస్తాయనేది మాత్రం తెలియడంలేదు. ఒక వేళ నిజంగానే పవన్ అలా చేస్తే మీడియా తప్పకుండ ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబుకు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వకమానదని పలువురు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయం తెలుపుతున్నారు. ఏది ఏమైనప్పటికి మరి పవన్ ఈ రోజు సాయంత్ర్రం ఎటువంటి ప్రకటన చేస్తారో చెప్పిన సమయం వరకు ఆగాల్సిందే మరి……

  •  
  •  
  •  
  •  

Comments