పవన్ టీడీపీ, బీజేపీ లతో తెగదెంపులు చేసుకుంటారా…?

Thursday, November 3rd, 2016, 02:38:04 PM IST

pawan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న సందర్భంలో పవన్ తన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించనున్నారని తెలియడంతో ఒక్క సారిగా రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ అంశం టీడీపీ, బీజేపీ వర్గాల్లో పెద్ద కలవరమే రేపుతుంది. ఇప్పటివరకు పవన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు పలికిన విషయం అందరికీ విదితమే. కానీ ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే అందుకు పవన్ విరుద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా గోచరిస్తోంది. ప్రత్యేక హోదా రాణి పక్షంలో ప్రజల తరుపున పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే పవన్ సరి కొత్త రాజకీయ అంకానికి తెరలేపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, బీజేపీ వర్గాలు పవన్ తమకు ఇస్తున్న మద్ధతును ఉప సంహరించుకొంటారని గుసగుసలు ఆడుతున్నాయి. అయితే పవన్ ఇంకా ఈ విషయం పై స్పష్టత మాత్రం ఇవ్వలేదు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం పెను మార్పులు సంభవిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.