తెలంగాణ లో నా బలం నాకుంది : పవన్ కళ్యాణ్

Tuesday, January 2nd, 2018, 08:39:51 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న సమస్యలపై తనదైన శైలిలో ప్రశ్నిస్తూ ముందుకు సాగారు. అయితే ఆయన చాలా రోజుల తరువాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తావించారు. సోమవారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు. ప్రగతి భవన్ లో పలు విషయాల గురించి వారు చర్చించుకున్నారు. ముఖ్యంగా రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా ఎలా సాధ్య పడిందనే విషయాన్ని కేసీఆర్ ని అడిగి తెలుసుకున్నానని, సమయం కుదరకపోవడం వల్లనే తెలుగు మహాసభలకు హాజరుకాలేదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. కేసీఆర్ ని కలిసిన వెంటనే ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి చర్చల అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ఆంధ్రా రాజకీయా నాయకులు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసికోవలని తెలిపారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల్లో 24గంటలు విద్యుత్ సరఫరా తనకు చాలా నచ్చిందని చెప్పారు. ఇక తెలంగాణ రాజకీయ పరంగా తన బలం తనకి ఉందని నా అభిమానులు కూడా ఇక్కడ ఉన్నారని పవన్ మీడియాకు వివరించారు.