ఎన్టీఆర్ కోసమే పవన్ వచ్చారట..

Monday, October 23rd, 2017, 02:45:15 PM IST

గత కొంత కాలంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ జనసేనని పేరు బాగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ తన తదుపరి చిత్రం అయిపోగానే ఇక ఎలక్షన్స్ వరకు తీరిక లేకుండా రాజకీయాల్లోనే గడపనున్నారు. అందుకు ఆయన ప్రత్యేక ప్రణాళికలను ఏర్పరచుకున్నట్లు తెలుస్తోంది. అందుకే వీలైనంత త్వరగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరక్కుతున్న తన 25వ సినిమాను పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాడు.

ఇప్పటికే షూటింగ్ చివరిదశలో ఉంది. ఒక్క యూరోప్ షెడ్యూల్ అయిపోతే సినిమా మొత్తం పూర్తయినట్టే. అసలైతే నిన్ననే పవన్ యూరోప్ షెడ్యూల్ కోసం పయనమవ్వాలి. కానీ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా లాంచింగ్ కార్యక్రమాలు ఉండడంతో పవన్, ఎన్టీఆర్ కోసం షెడ్యూల్ ని వాయిదా వేసుకున్నాడు. ఈ రోజు ఎన్టీఆర్ 28వ చిత్రం ప్రారంభోత్సవ పూజ కార్యక్రమంలో పాల్గొని చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అంతే కాకుండా తొలి క్లాప్‌ కొట్టారు. తారక్, పవన్ కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా వారిద్దరూ ఆప్యాయంగా కౌగిలించుకోవడంతో ఇరు వర్గాల అభిమానులు చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.