పవన్ కళ్యాణ్ సభ కోసం ప్రత్యేక పాట విడుదల….!!

Monday, November 7th, 2016, 05:00:27 PM IST

janasena-fans
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కల్పించాలని పవన్ ముచ్చటగా మూడో సారి ఏర్పాటు చేస్తున్న అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజి ప్రాంగణంలో నిర్వహించనున్న సీమాంధ్ర హక్కుల చైతన్య సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సారి ఈ సభలో పవన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సమర శంఖం పూరించడానికి సిద్ధం అవుతున్నట్లు ఒఇక్కద స్పష్టంగా అర్థం అవుతోంది. ప్రత్యేక హోదా అంశంతో పాటు అనంతపురంలో కరవు సాగు తాగునీరు తదితర అంశాలపై కూడా పవన్ మాట్లాడబోతున్నారు. ముందుగా పాటను కూడా రిలీజ్ చేయడంతో పవన్ ప్రసంగం కూడా అదే స్థాయిలో ఉంటుందని, పక్కాగా ప్రసంగాన్ని రూపొందించారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.