ప్రత్యేక హోదాపై ప్రారంభమైన పవన్ సభ…!!

Thursday, November 10th, 2016, 04:24:01 PM IST

pk
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికార, ప్రతిపక్ష నాయకులు దినాద్ చేస్తుంటే కేంద్రం మాత్రం కంటి తుడుపు చర్యగా హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ని ప్రకటించడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీనియర్ సినీ నటుడు, జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముచ్చటగా మూడో సారి అనంతపురం లో భారీ బహిరంగ సభను కొద్ది సేపటి క్రితమే ప్రారంభించారు. పవన్ ప్రసంగం ప్రారంభంలోనే కేంద్ర ప్రభుత్వం పై విరుచుకు పడుతూ సభను ప్రారంభించారు. ప్రధానంగా వెంకయ్య నాయుడి ని టార్గెట్ చేసి విమర్శలను సంధిస్తున్నారు పవన్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటించిన కేంద్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఇక్కడి ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మంది పడుతున్నారు.

ఫోటోల కోసం క్లిక్ చేయండి