కన్నీరు పెట్టిన పవన్

Saturday, October 18th, 2014, 10:30:16 PM IST

pavan-1
ఖమ్మం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో మెనెంజిటిస్ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న పాల్వంచకు చెందిన శ్రీజ అనే 13ఏళ్ళ బాలికను ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. తనకు సినీ హీరో పవన్ కళ్యాణ్ ను చూడాలని ఉందని మూడు రోజుల క్రితం శ్రీజ తన కోరికను తెలుపగా, మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా ఆ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ శ్రీజను పలకరించడానికి ఖమ్మం చేరుకున్నారు.

ఇక ఆరోగ్య పరిస్థితి బాగోలేక బలహీనంగా ఉన్న శ్రేజ చెవి దగ్గర పలుమార్లు ఆమెను పేరు పెట్టిపిలిచిన పవన్, ఆమెలో చలనం లేకపోవడంతో శ్రీజ చేయి పట్టుకుని చాలా సేపు కూర్చున్నారు. ఇక ఆమె పరిస్థితిని చూసి పవన్ చలించి కంటతడి పెట్టారు. అనంతరం డాక్టర్లను అడిగి శ్రీజ ఆరోగ్య విషయంపై ఆరా తీసి అటుపై ఆమె తల్లిదండ్రులను పరామర్శించారు. అలాగే శ్రీజ తల్లిదండ్రులకు రెండు లక్షల చెక్ , వెండి లక్ష్మిదేవి విగ్రహాన్ని ఇచ్చి వారికి ధైర్యం చెప్పారు. ఇక పవన్ రాకతో హాస్పిటల్ ప్రాంగణమంతా అభిమానులతో కోలాహలంగా మారింది.

వీడియో కోసం క్లిక్ చేయండి