ఎలక్షన్స్ తర్వాత పవర్ స్టార్ రీఎంట్రీ ఖాయమేనా..?

Tuesday, February 12th, 2019, 11:25:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక చివరగా నటించిన సినిమా అజ్ఞాతవాసి తర్వాత ఇక సినిమాల్లో నటించబోనని, పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించాలని నిర్ణయించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను నిరాశకు గురి చేసింది, ఇక తమ అభిమాన నటుడ్ని తెరపై చూడలేమన్న బాధతో కాలం వెళ్లదీస్తున్నారు. అయితే 2019ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లో కచ్చితంగా రీఎంట్రీ ఇస్తాడని అంటున్నారు, త్వరలో రాబోయే ఎన్నికలను పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకోవట్లేదని, తప్పకుండ గెలిచి అధికారంలోకి రావాలని బావించట్లేదని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ 2019ఎన్నికలను రిహార్సల్ గా భావిస్తున్నారని, ఈ ఎన్నికల్లో తనకు వచ్చే ఓటు శాతాన్ని బట్టి భవిష్యత్ లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నవి నిర్ణయించుకోనున్నారట. దీన్ని బట్టి ఆయనకు ఎన్నికల తర్వాత చాలా సమయం ఉంటుంది కాబట్టి కనీసం సంవత్సరానికి ఒక సినిమా అయినా చేసే అవకాశం ఉందని అంటున్నారు. రాజకీయాల్లో ఉంటూనే ఆయన వీలును బట్టి కండిషన్ మీద సినిమాల్లో నటించే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో పలువురు నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్సులు కూడా వెనక్కివ్వలేదు కాబట్టి తప్పకుండ వారికి సినిమాలు చేస్తాడని అంటున్నారు. ఇదే గనక నిజం అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి.