ప్రముఖ న్యూస్ ఛానల్ ఎండి పై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Tuesday, April 24th, 2018, 09:27:58 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై, అలానే ఆయన తల్లిని ఉద్దేశించి ఇటీవల వర్ధమాన నటి శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. ఆమె ఆ పరుష వ్యాఖ్యలు చేసిన సమయంలో మీడియా చానెల్స్ కొన్ని ఆ వీడియో లను పదే పదే ప్రసారం చేయడం పట్ల పవన్ ట్విట్టర్ తీవ్ర రీతిలో విరుచుకుపడుతున్నారు. ఎప్పుడు ఒకింత మౌనంగా వుండే పవన్ వారికి కూడా తమ బాధ తెలియాలని ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే తన తల్లిని అసభ్య పదజాలంతో దూషించడానికి కారణమైన రాంగోపాల్ వర్మ, ఇద్దరు న్యూస్ చానెల్స్ అధినేతలపై ఆయన ఫైర్ అవుతున్నారు.

ఈ సందర్భంగా నిన్న రాత్రి ఆయన ఒక ఆసక్తికర ఫోటోతో పాటు ట్వీట్ కూడా చేశారు. బాబు మీ నాన్నకు అన్నం, పప్పు, చారు తో పాటు కాస్త సంస్కారం కూడా కలిపి పెట్టారా అలానే సంస్కారవంతమైన సోప్ తో ఆయనకు తల స్నానం చేయించారు అంటూ అందరికి గుడ్ నైట్ చెప్పారు. అయితే ఆయన చేసిన ఈ ట్వీట్ పై పలువురు స్పందిస్తూ, బాగా చెప్పారు సర్ అంటూ ఆయనకు మద్దతుపలుకుతున్నారు. అయితే పవన్ చేసిన ఈ ట్వీట్ పై ఆ ఛానల్ అధినేత ఎలా స్పందిస్తారో వేచి చూడాలి……

  •  
  •  
  •  
  •  

Comments