బీజేపీ పై పవన్ సంచలన వాఖ్యలు – పాక్ మీడియా లో కథనం

Friday, March 1st, 2019, 04:02:01 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యాలను పాక్ లోని ప్రముఖ మీడియా సంస్థ “డాన్” తన వెబ్ సైట్ లో ప్రచురితం చేసింది. భారత్ లో ఎన్నికలకు ముందు పాక్ తో యుద్ధం జరుగుతుందని, బీజేపీ తనకు రెండేళ్ల క్రితమే తనకు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వాఖ్యలను పాక్ మీడియాలో ప్రస్తావించింది. దానికి సంబంధించి క్లుప్తంగా సమాచారం ఇస్తూ మనదేశానికి చెందిన ఒక ఇంగ్లీష్ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనాన్ని లింక్ చేసింది. కర్నూలులో జరిగిన ఓకే ఎన్నికల ర్యాలీలో పవన్ కళ్యాణ్ ఈ వాఖ్యాలను చేశారని, అంతేకాకుండా పవన్ కు గతం లో బీజేపీ తో అన్ని సత్సంబంధాలు ఉండేవని కూడా ప్రచురించింది.

పాక్ లో హనుడువుల పరిస్థితి ఎలా ఉందొ కానీ మన భారత్ లో మాత్రం ముస్లింలను చాల గౌరవిస్తారని చెప్పుకొచ్చారు. మన దేశంలో అందరికి సమాన హక్కులున్నాయని, అందువల్లనే ఇక్కడ అందరు కూడా కలిసిమెలిసి ఉంటారని ప్రస్తావించారు. అందువల్లే అజహరుద్దీన్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అయ్యారు, అబ్దుల్ కలాం ఈ దేశ రాష్ట్రపతి అయ్యారు” అని పవన్ తన ప్రసంగంలో చెప్పినట్లు ఈ కథనం తెలియజేసింది.
అయితే యుద్ధం పేరుతో బీజేపీ చివరి క్షణంలో జిమ్మిక్కులు చేస్తుందని కొద్ది నెలల క్రితమే తాను హెచ్చరించానంటూ తాను చెప్పిన విషయాన్నే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ధృవపరిచారన్నారు.

పవన్ వ్యాఖ్యలు ఇవేనంటూ డాన్ వెబ్‌సైట్ వాటిని ప్రత్యేకంగా హైలైట్ చేసింది… “యుద్ధం వస్తుందని నాకు రెండేళ్ళ కిందటే చెప్పారు. దీన్ని బట్టి మన దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందన్నది అర్థం చేసుకోవచ్చు”… జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్