పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే ఓటేస్తానంటున్న వర్మ

Tuesday, August 6th, 2013, 01:15:40 PM IST


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. తన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ మరోసారి అలాంటి ప్రయత్నం చేసాడు . ప్రస్థుతం టాలీవుడ్ లొ కిర్రాక్ పుట్టిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ట్విటర్ లో ప్రశంశల వర్షం కురిపించాడు. ‘ఇప్పటి వరకు నా జీవితంలో ఎప్పుడు ఓటు వెయ్యలేదు .. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని ప్రారంభిస్తే ఓటు వేస్తాను అనే మాటకు కట్టుబడి ఉంటాను. పవన్ కళ్యాణ్ కు నా ఓటు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పవర్ స్టార్ కు ఓటు వేసేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనల్లో నిజాయితీ,కళ్లలో పట్టుదల, చరిష్మా,ఇంటెన్సిటిలను బాల్ థాకరేలో కూడా చూడలేదు. ప్రజారాజ్యం పార్టీకి పవన్ కళ్యాణ్ సారథ్యం వహించి ఉంటే అఖండ మెజారిటీని సాధించి ఉండేదని నా ప్రగాఢ విశ్వాసం’ అని రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు చేశారు. ఇంకా తాను పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి చేసిన వ్యాఖ్యలు కాదని.. తాను పవన్ ను కలిసి ఐదు సంవత్సరాలైందన్నాడు. ఓ డైరెక్టర్ గా కాకుండా ఓ ఆంధ్ర ప్రదేశ్ పౌరుడిగా స్పందించానని వర్మ తెలిపాడు.స్వతహాగా అభ్యుదయ భావాలున్న పవన్ స్క్రీన్ హీరోగానే కాదు, రియల్ హీరోగా కూడా మంచి మార్కులు సాధిస్తాడన్నారు. అంతేకాదు గతంలో ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎంజిఆర్, చిరంజీవిల కంటే పవన్ డైనమిక్ లీడర్ అవుతాడని కితాబిచ్చాడు.