జనసేన పార్టీ ఎత్తేస్తున్నారా…? – క్లారిటీ ఇచ్చిన జనసేనాని

Tuesday, April 23rd, 2019, 08:40:24 PM IST

ఇటీవల ఏపీలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలతరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకోబోయే తరువాతి నిర్ణయం ఏంటా అని అందరు కూడా ఎదురు చూస్తున్నారు. తాను ఇక్కడ పల్లకి మోయడానికి రాలేదని, తాని ఏపీకి ముఖ్యమంత్రి కాకుండా ఎవరు కూడా ఆపలేరని పవన్ గతంలోనే ప్రకటించారు. అంతేకాకుండా పవన్ వాఖ్యలకు తగ్గట్టు, పవన్ నిర్వహించినటువంటి ఎన్నిక పరచారంలో భాగంగా పవన్ అక్కడ అందరితో కూడా సీఎం పవన్ అని పిలిపించుకునే ప్రయత్నం కూడా బాగానే చేశారు.

ఎన్నికలకు ముందుగానే ఇలాంటి హడావుడి చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నికల తరువాత సైలెంట్ గా ఉండటం అందరిని కూడా విస్మయానికి గురిచేస్తుంది. దీనితో పాటు ఇక జనసేన తట్టా బుట్టా సర్దేయడం ఖాయం అనే మీడియా లో వచినటువంటి వార్తలు కూడా అందరిని ఆలోచనలకు గురి చేస్తుంది. దానికి తోడు ఇదివరకున్న జనసేన ఆఫీసుల ముందు టూలేట్ బోర్డులు కనిపించడంతో ఆ వార్తలకు బలం చేకూరిందని చెప్పాలి. అయితే ఈ విషయం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చారు.

ఇదివరకు నిర్వహించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఆఫీసులను తిరిగి కొనసాగించాలని, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, కేవలం కార్యకర్తలు కూర్చోవడానికి మరియు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక పెద్ద రూమ్ ఉంటె చాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇవన్నీ చెప్పిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కార్యాలయాలను మూసివేయడం పై మాట్లాడకపోవడం గమనార్హం.