2019 లో వైసిపి – టీడీపీ కలుస్తాయ్ : పవన్

Monday, May 28th, 2018, 01:12:17 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మాటల తూటాలను రోజు రోజుకు పెంచేస్తున్నారు. టీడీపీ పొరపాట్లను తనదైన శైలిలో ప్రజలకు అర్థమయ్యేలా చెబుతూ దానికి జనసేన ఏం చేస్తుంది అనే విషయాన్ని కూడా వివరించారు. ఎవరు ఉహించనిక్ విధంగా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు కబ్జా ఆంధ్రప్రదేశ్ గా మారిందని చెబుతూ.. అన్నిటికి కారణం చంద్రబాబుకు నిర్లక్షమే అని చెప్పారు.

శ్రీకాకుళం జిల్లా ఆముదాల ప్రాంతంలో సభను నిర్వహించిన పవన్ బహిరంగ సభలో ఒక జోస్యం చెప్పారు. అవసరం అయితే వచ్చే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తెలుగు దేశం పార్టీ – వైసీపీ అలాగే కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని తెలియజేశారు. ఇక చంద్రబాబు ఓటుకు నోటు కేసు విషయంలో కేంద్రానికి భయపడుతున్నారని చెప్పిన పవన్ శ్రీకాకుళం లో కబ్జాలు ఇసుక దోపిడులు ఎక్కువయ్యాయని చెప్పారు. మట్టిని దోచుకోవడం బాగా అలవటయింది. కొన్ని రోజులైతే ఇసుక మ్యూజియం పెట్టుకోవాలి. ఎక్కడ భూమి కనిపించినా టీడీపీ నేతలు లాగేసుకుంటున్నారు. మట్టిని దోచుకునే వాడు మట్టిలోనే కలిసిపోతారు అని జనసేన అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments