తాను పోటీ చేసేది ఎక్కడి నుంచో చెప్తానన్న పవన్ !

Thursday, December 6th, 2018, 04:00:49 PM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే అంశంపైనా ఆరంభం నుంచి ఆసక్తి నెలకొని ఉంది. అభిమానులు ఎవరికి వారు తమ ప్రాంతం నుండి పోటీ చేయండంటే తమ ప్రాంతం నుండి పోటీ చేయండని అడుగుతున్నారు. పవన్ ఎక్కడ బహిరంగ సభలు పెడితే అక్కడి సామాన్య జనం సైతం ఇక్కడి నుంచే పోటీ చేయవచ్చు కదా అంటున్నారు.

ఇన్ని డిమాండ్ల మధ్యలో పవన్ మొదట అనంతపురం నుండి పోటీ చేస్తానని అన్నారు. కానీ ఆ తరవాత దాని ఊసే ఎత్తలేదు. కొంత కాలమేమో గోదావరి జిల్లాల్లో ఏదో ఒక ప్రాంతం నుండి పవన్ పోటీ చేసే ఛాన్సులున్నాయని బలమైన వార్తలు వినిపించాయి. అయితే పవన్ మాత్రం ఇన్నాళ్లు ఈ అంశంపై పూర్తిస్థాయి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈరోజు అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొందరు ఎక్కడి నుండి పోటీ చేస్తారు అని అడగ్గా ఆ విషయాన్ని ఫిబ్రవరిలో ఫైనల్ చేస్తానని సమాధానమిచ్చారు పవన్. మరి పవన్ తనకు మంచి పట్టున్న గోదావరి వైపు నుండి బరిలోకి దిగుతారా లేకపోతే బలమైన నాయకత్వ అవసరం ఉన్న సీమ జిల్లాలను ఎంచుకుంటారా అనేది చూడలి.