నా జీవితం తెరచిన పుస్తకం.. జగన్ కు పవన్ కౌంటర్!

Saturday, July 28th, 2018, 09:08:42 AM IST

మొన్నటివరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన పరిణామాలు ఒక ఎత్తు అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మరో విధంగా ఉన్నాయి. ఎప్పుడు చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్టు మాటల తూటాలు పేలేవి. ఇప్పుడు ఏకంగా పవన్ వర్సెస్ జగన్ అన్నట్లు కథనాలు వస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా జగన్ చేసిన కామెంట్స్ ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ కూడా అందుకు ధీటుగా సమాధానం చెప్పాడు. ఇకపోతే భీమవరంలో ఇటీవల జరిగిన మీటింగ్ లో జనసేన అధినేత మరోసారి స్పందించాడు.

పవన్ మాట్లాడుతూ.. చంద్రబాబును ఎదుర్కోలేక దమ్ము లేక అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు. మీ స్థానంలో నేను ఉంటే ప్రభుత్వాన్ని ఓ ఊపు ఊపేసేవాడిని. ప్రతిపక్ష స్థానంలో ఉండే నాయకుడి శక్తి మీకేమి తెలుసనీ ప్రశ్నించారు. అదే విధంగా జగన్ చేసిన కామెంట్స్ గురించి స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ జీవితం తెరచిన పుస్తకం. చాలా మంది జీవితాల్లో కనిపించని పేజీలు ఉంటాయి. నా జీవితం అలా కాదు. దాపరికాలు లేవు. ప్రజాస్వామ్యాన్ని వాడుకోవట్లేదని నేను ప్రశ్నిస్తే నాపై విమర్శలు చేస్తారా? దమ్ము ధైర్యం లేక అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు. ముందు చంద్రబాబును ఎదుర్కొండని జనసేన అధినేత తన వివరణ ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments