రేణు దేశాయ్ – శ్రీ రెడ్డి కామెంట్స్ పై పరోక్షంగా స్పందించిన పవన్!

Tuesday, July 10th, 2018, 04:18:20 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా రాజకీయాల్లో కీలక నేతగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడా కూడా తగ్గకుండా తన యాత్రలతో మీటింగ్ లతో జనాలను ఆకర్షిస్తున్నాడు. అలాగే ప్రజల సమస్యలను గుర్తిస్తూ వాటిపై చర్చలు జరుపుతుండడంతో చాలా మంది పవన్ శైలిని ఇష్టపడుతున్నారు. అయితే పవన్ ఎక్కడికెళ్లినా కూడా మద్దతు బాగానే అందుతోంది గాని ఆయన వ్యక్తిగత విషయంపై తరచు వ్యాఖ్యలు చేసేవారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది.

ముఖ్యంగా పవన్ రేణు దేశాయ్ విడాకులకు సంబంధించి ఇటీవల వచ్చిన వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలాగే రేణు దేశాయ్ కూడా ఫ్యాన్స్ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని పవన్ వల్లే విడాకులు తీసుకున్నట్లు వివరణ కూడా ఇచ్చారు. అదే విధంగా గతంలో శ్రీ రెడ్డి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై పవన్ పరోక్షంగా స్పందించాడు. మహిళలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం తనకు ఇష్టం ఉండదని మహిళను ఎంతగా గౌరవిస్తానో తన అక్కా చెల్లెళ్లకు తెలుసనీ ఇటీవల మహిళా కార్యకర్తలతో జరిపిన ఒక మీటింగ్ లో పవన్ తెలిపాడు. ఎందుకంటే వారి గౌరవానికి భంగం కలిగేలా జీవితాన్ని రోడ్డుకి ఈడ్చడం తనకు ఇష్టం ఉండదని పవన్ వివరణ ఇచ్చాడు. అంతే కాకుండా కొందరు మహిళలు తనపై ఎన్ని నిందలు వేసినా బరిస్తాను అని చెప్పాడు. నేనేదో చేతకాక కాదు. చూస్తుంటాను.. నన్ను ఎంత నిందించినా బరిస్తాని కానీ జనాల తాలూకు విషయాల గురించి తక్కువగా మాట్లాడితే బలంగా మాట్లాడతాను అని జనసేన అధినేత తెలిపాడు.

  •  
  •  
  •  
  •  

Comments