పవన్,జగన్ ఓటుకి 5000 పంచడానికి రెడీగా ఉన్నారట..టీడీపీ ఎమ్మెల్సీ

Wednesday, October 3rd, 2018, 04:04:07 PM IST

వైసీపీ అధినేత జగన్ మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లు ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద విమర్శలు కురిపించడంలో రోజురోజుకి తీవ్రతను పెంచుతున్నారు,ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే జగన్ చేసే వ్యాఖ్యల కన్నా పవన్ చేసే వ్యాఖ్యల మీదనే టీడీపీ వారు ఎక్కువ అసహనానికి గురవుతున్నారని,రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ రోజు జగన్ మరియు పవన్ చేస్తున్న వ్యాఖ్యలకు గాను టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.తన సొంత అన్నని,బావని ప్రజారాజ్యం సమయంలో గెలిపించుకోలేని పవన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఎలా గెలిపించేశారని చెప్పుకుంటున్నారని ప్రశ్నించారు.జగన్ చేసే వ్యాఖ్యలు ఐతే అసలు ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవట్లేదని,వీరందరూ ఈ రాష్ట్రానికి పట్టిన శని అని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక పక్క వై ఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో ఓటుకి 5000 ఖర్చు పెట్టె పరిస్థితిలో ఉన్నారని,బీజేపీ డైరెక్షన్లో పవన్ కూడా వచ్చే ఎన్నికల్లో ఒక్కొక్క ఓటుకి 5000 పంచడానికి రెడీగా ఉన్నారని,తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.