వైరల్ పిక్స్ : బాహుబలి గెటప్ లో రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ !

Monday, October 30th, 2017, 09:31:20 PM IST

సంచలన విషయం ఏదైనా అందులో వెంటనే దూరిపోవడం వివాదాస్పద దర్శకుడు వర్మకు అలవాటే. కొద్ది సేపటి క్రితమే రేవంత్ రెడ్డి బాహుబలి లాంటి వాడని, బాహుబలి కలెక్షన్ల వర్షం కురిపించిన విధంగా కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి ఓట్ల వర్షం కురిపిస్తాడని పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతటితో వర్మ ఈ విషయాన్ని వదిలేసాడని భావిస్తే తప్పులో కాలేసినట్లే.

రేవంత్ రెడ్డి – బాహుబలి అన్న కాన్సెప్ట్ కు వర్మ తన క్రియేటివిటీని జోడించారు. ఆవేశంగా ఉన్న రేవంత్ రెడ్డికి బాహుబలి గెటప్ జోడించి పోస్ట్ చేశాడు. ఈ ఫోటో నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ ఫార్ములాని ఫాలో అయిపోయారు. వర్మ రేవంత్ రెడ్డి ఫొటోకు సాహోరే రేవంత్ రెడ్డి అని కామెంట్ కూడా జత చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments