బాబాయ్ పొగిడేసాడు .. నాకు ఇలాంటి ఛాన్స్ రాలేదన్న పవన్ ?

Wednesday, April 4th, 2018, 01:26:31 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఎక్కడ చుసిన అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఎక్కడికెళ్లినా జనం చిట్టి బాబు అదరగొట్టావంటూ ఓ రేంజ్ లో ఫాన్స్ అయిపోతున్నారు. రంగస్థలం సినిమాలో చరణ్ నటన చుసిన వాళ్లంతా ఫిదా అవుతున్నారు. చిట్టిబాబు గా చరణ్ నటనతో సినిమాను నిలబెట్టాడు. నటుడిగా మరో మెట్టు ఎక్కేసాడు చరణ్. ఇటీవలే విడుదలైన ఈ సినిమా అన్ని ఏరియాల్లో సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక చరణ్ కు తన బాబాయ్ పవర్ స్టార్ నుండి కూడా అభినందనలు రావడంతో మెగా ఫాన్స్ ఓ రేంజ్ లో ఖుషి అవుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ షో వేసి మరి చూపించాడు చరణ్ .. ఈ సినిమా చుసిన పవన్, చరణ్ ని పొగడకుండా ఉండలేకపోయాడట. ప్రతి సీన్ లో ఇన్వాల్వ్ అయి నటించాడు చరణ్. చిట్టి బాబు పాత్రలో జీవించాడు అని చెప్పడమే కాకుండా శ్రీ రామ్ చరణ్ గారికి అంటూ సంబోదించి .. అభినందనలు తెలిపినా డైరెక్ట్ గా మాత్రం నువ్వు లక్కిరా అన్నాడట, నా కెరీర్ మొత్తంలో ఇలాంటి గొప్ప అవకాశం నాకు రాలేదని చెప్పాడట. తన ఫేవరేట్ అయినా బాబాయే ఈ రేంజ్ లో పొగిడేస్తే .. చరణ్ ఎగిరి గంతేయ్యకుండా ఉంటాడా చెప్పండి.