ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం.. జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు.. బ‌య‌ట‌ప‌డుతున్న‌ పవన్ అసలు రంగు..!

Friday, November 16th, 2018, 04:04:12 PM IST

ఏపీలో ఎన్నిక‌లు స‌మీప‌స్తున్నందున అక్క‌డి రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఏప్రిల్‌లో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న వార్త‌లు వ‌స్తున్న నేప‌ధ్యంలో అధికార‌, ప్ర‌తిప‌క్షాలు త‌మ‌దైన వ్యూహాల‌తో ముందుకు వెళుతూ.. ఒక‌రి పై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నారు. ఈ విమ‌ర్శ‌లు గుప్పించే విష‌యంలో జ‌న‌సేన అధినేత కాస్త ముందున్నారు. గ‌తె ఎన్నిక‌ల్లో టీడీపీ భ‌జ‌న చేసి పొత్తు పెట్టుకుని వైసీపీ ఓట్లు చీల్చి టీడీపీని గ‌ట్టెక్కించింన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల ఆ పార్టీ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చారు.

టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వాడ‌కం దెబ్బ‌కి మైండ్ బ్లాక్ అయిన ప‌వ‌న్.. బ‌య‌ట‌కు వ‌చ్చి వారి పై విమ‌ర్శ‌లు చేయ‌డం మొద‌లు పెట్టారు. ముఖ్యంగా నారా లోకేష్‌ను టార్గెట్ చేసిన ప‌వ‌న్ జ‌న‌సేన బ‌హిరంగ స‌భ‌ల్లోనూ సోష‌ల్ మీడియాలోనూ లోకేష్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. లోకేష్ కౌంట‌ర్లు ఇచ్చినా.. ఆ ఎపిసోడ్‌లో మాత్రం ప‌వ‌నే పైచేయి సాధించారు. ఇక చంద్ర‌బాబాతో స‌హా టీడీపీ త‌మ్ముళ్ళ పైన కూడా వ్యాఖ్య‌లు చేస్తూ ప‌వ‌న్ అనేక చిందులు తొక్కినా..ఆయ‌న వ్యాఖ్య‌ల్ని లైట్ తీసుకున్నారు టీడీపీ నేత‌లు. అయితే మొన్న‌టివ‌ర‌కు టీడీపీని విమ‌ర్శించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇటీవ‌ల వైసీపీని టార్గెట్ చేశాడు.

ఇటీవ‌ల వ‌రుస ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న ప‌వ‌న్.. జ‌న‌సేన నిర్వ‌హిస్తున్న బ‌హిరంగ స‌భ‌ల్లో జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నాడు. ప్ర‌తిప‌క్ష నేతగా జ‌గ‌న్ ఫెయిల్ అయ్యాడ‌ని, అసెంబ్లీకి వెళితేనే జ‌గ‌న్ మ‌గ‌త‌నం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు కూడా చేశారు. దీంతో ప‌వ‌న్ వ్యాఖ్య‌ల పై అనేక అనుమానాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో తెర పైకి వ‌స్తున్నాయి. ప‌వ‌న్ టీడీపీ నేత‌ల పై చేస్తున్న వ్యాఖ్య‌లు పెద్ద‌గా వారికి న‌ష్టం లేదు. ఎందుకంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చే ఛాన్సేలేదు. కానీ జ‌గ‌న్ పై చేస్తున్న వ్యాఖ్య‌ల వ‌ల్ల వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ పై తీవ్ర ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంది. జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత‌గా విఫ‌ల‌మ‌య్యాడ‌ని ప‌వ‌న్ ప‌దే పదే చేస్తున్న‌ వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల్లో బ‌లంగా వెళుతున్నాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌ధ్యంలో వైసీపీ డ్యామేజీ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ప‌వ‌న్ టార్గెట్ కూడా అదేన‌నుకోంది.

అయితే ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌న్ని ప్ర‌జ‌లు అంత తేలిగ్గా న‌మ్ముతారా.. గ‌తంలో ప్ర‌జారాజ్యం అప్పుడు టీడీపీని తిట్టాడు.. ఆ తర్వాత టీడీపీ జ‌త‌కట్టి చంద్ర‌బాబుకు ఓటువేయండి రాష్ట్రాభివృద్ధి నాధి గ్యారెంటీ అన్నాడు.. ఇప్పుడు టీడీపీ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి నాడు చంద్ర‌బాబును న‌మ్మి మోస‌పోయాన‌ని చెబుతున్నాడు.. చంద్ర‌బాబు రాష్ట్రాన్ని బ్ర‌ష్టుప‌ట్టించార‌ని, అదే టైమ్‌లో జ‌గ‌న్ కూడా ప్ర‌తిప‌క్ష‌నేత‌గా విఫ‌ల‌మ‌య్యాడ‌ని ప‌వ‌న్ త‌న‌దైన శైలిలో ఊగిపోతూ విమ‌ర్శ‌లు చేస్తున్నాడు. దీంతో రోజుకో మాట‌.. పూట‌కో రంగు మార్చే ప‌వ‌న్ ఇంకా పూర్తిగా రాజ‌కీయాల్లో ఓన‌మాలు కూడా దిద్ద‌కుండా.. రాజ‌కీయంగా ఎంతో ప‌రిణ‌తి సాధించిన జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేసే అర్హ‌త లేద‌ని.. ఆయ‌న‌కి అప్పుడే సీయం కుర్చీపై ఆశ మ‌ళ్ళంద‌ని .. త‌ను రాజ‌కీయాల్లో వ‌చ్చింది ప్ర‌శ్నించ‌డం కోసం అని.. ప‌ద‌వుల కోసమ‌ని, ప‌దే ప‌దే చెప్పే ప‌వ‌న్ అస‌లు రంగు బ‌య‌ట ప‌డుతోంద‌ని.. పైకి టీడీపీని టార్గెట్ చేసి విమ‌ర్శలు చేస్తూ క‌ల‌రింగులు ఇస్తున్న ప‌వ‌న్ అసలు టార్గెట్ మాత్రం జ‌గ‌నే అని.. అయితే జ‌గ‌న్ పై ప‌వ‌న్ ఎన్ని వ్యాఖ్య‌లు చేసినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యాన్ని ఆప‌లేర‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.