టీడీపికి కౌంటర్ ఇచ్చిన పవన్!

Friday, March 16th, 2018, 01:39:15 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు వేడిగా ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే. తెలుగు దేశం పార్టీ – బీజేపీ పార్టీ మొన్నటికి వరకు మిత్రపక్షంగా ఉండి ఇప్పుడు ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయాయి. చంద్రబాబు ఒక్కసారిగా మాస్టర్ ప్లాన్ ని అమలు చేసి బిజేపిపై పై అవిశ్వాసతీర్మానానికి ప్రణాళికలను సిద్ధం చేశారు. అయితే మొన్నటి వరకు ఇరుపార్టీలతో స్నేహంగా వెళ్లిన జనసేన పవన్ ఇరు పార్టీలపై మాటల తూటాలను పేల్చారు. అయితే అందుకు కౌంటర్ గా టీడీపీ నేతలు ఇదంతా బీజేపీ చేస్తోన్న కుట్ర అంటూ.. పవన్ కళ్యాణ్ ను తమపైకి అనవసరంగా ఉసిగొలిపారని ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయంపై పవన్ స్పందించాడు. ‘నిన్నటిదాక టీడీపీ డైరెక్షన్ అన్నారు, ఈరోజేమో వాళ్ళని అడగ్గానే బీజేపీ డైరెక్షన్ అంటున్నారు. ఇది ఎవరి డైరెక్షన్ కాదు, ఇది ప్రజల డైరెక్షన్!!! ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ డైరెక్షన్లో వెళ్తాము కానీ ఏ ఒక్క పార్టీ డైరెక్షన్లో వెళ్లం’ అని వివరణ ఇచ్చారు.