నా కొడుకంత ఉన్న పిల్లాడికి మొత్తం చర్మ వ్యాదులే : పవన్!

Wednesday, June 27th, 2018, 05:04:28 PM IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన రాజకీయ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. నేడు విశాఖలో ఉత్తరాంధ్ర మేధావులతో చర్చల అనంతరం పలువురు వారి విధానాలను తెలియజేశారు. ప్రజా గాయకుడు వంగపండు, ప్రొ. కేఎస్ చలం, ప్రొ. కేవీ రమణ అలాగే వామపక్ష ప్రజా ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఇక పవన్ మాట్లాడుతూ పలు సమస్యల గురించి తెలియజేశారు. ఉత్తరాంధ్ర సమస్యలను ఎలాగైనా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకు వెళతాను అని చెప్పారు.

చాలా వెనుకబడిపోయిన ప్రాంతాల గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. స్థానిక నాయకులూ సమస్యల గురించి పట్టించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సమస్యల గురించి పట్టించుకోకుంటేనే విభజన సమస్యలు తెలెత్తుతాయి. ఏజెన్సీ ప్రాంతంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. చిన్నారులు చాలా మంది చర్మ వ్యాధులతో బాధ పడుతున్నారు. రక్తహీనత, రేచీకటి, చర్మ సంబంధ వ్యాధులు కూడా వారిని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నా కొడుకంత ఉన్న ఓ బాలుడిని చూసి ఎంతో బాధ కలిగింది. వారిని పట్టుకొని చుస్తే చర్మ ఒళ్ళంతా వ్యాధులతో కనిపించడం చాలా బాధాకరం. కనీసం వైద్య సహాయం కూడా అక్కడ లేదు. ఇక ఉత్తరాంధ్ర ప్రజల గురించి అలోచించి తనవంతు సహాయాన్ని అందిస్తాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.