కామ్రేడ్ల కలల్ని పూర్తిగా కూల్చేసిన పవన్ !

Monday, October 29th, 2018, 10:54:01 AM IST

ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిస్టులకు కాలం అస్సలు కలిసి రావడంలేదు. మంచి సిద్ధాంతాలు కలిగిన పార్టీ అనే పేరున్నా జనాదరణ లేకపోవడంతో నడవలేక నడుస్తున్న ఈ పార్టీకి జనసేన రూపంలో పవన్ కళ్యాణ్ ఒక ఆశాకిరణంలా కనిపించాడు. అశేషాభిమానుల్ని కలిగి ఉన్న పవన్ కు మొదటి నుండి కమ్యూనిస్టు భావజాలం ఎక్కువ కాబట్టి ఆయనతో కల్సి నడిస్తే భవిష్యత్తు బాగుబుతుందని వామపక్ష నేతలు ఆశించారు.

ఈ మేరకు ఆయన్ను కలిసి రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దాం అనే తమ ఉద్దేశ్యాన్ని వ్యక్తపరిచారు. ఈ మేరకు మొదట్లో కొంత సానుకూలంగానే స్పందించి వారితో కలిసి ర్యాలీలు, మీటింగుల్లో పాల్గొన్న పవన్ ఆ తర్వాత కామ్రేడ్లను నిర్లక్ష్యం చేశారు. కనీసం వారికి తనను కలిసే అవకాశం కూడ ఇవ్వలేదు. అసలు కలుస్తారా కలవరా అనేది కూడ చెప్పకుండా కాలయాపన చేశారు. పవన్ తమని ఎంత దూరం పెడుతున్నా కమ్యూనిస్టుల్లో ఏమూలనో ఏమో పవన్ కు మనం ఉన్నపళంగా గుర్తొస్తామేమో అనే చిన్న ఆశతో ఉంటూ వచ్చారు.

కానీ నిన్న అధికార, ప్రతిపక్షాలకు సంధానం చెబుతూ తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, తమకు ఎవరి సపోర్ట్ అవసరంలేదని పవన్ బల్లగుద్ది చెప్పేశాడు. దీంతో ఎర్ర దళానికి ఇన్నాళ్లు వీడి వీడనట్టు ఉన్న మబ్బులు పూర్తిగా విడిపోయినట్టైంది.

  •  
  •  
  •  
  •  

Comments