ప‌వ‌న్ కంటికి శ‌స్త్ర‌చికిత్స‌

Friday, July 13th, 2018, 05:15:00 PM IST


ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌న‌సేనానిగా ప్ర‌జ‌ల్లోకి వెళుతూ అంత‌కంత‌కు వేడి పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. 2019 జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఏపీలో అన్ని అసెంబ్లీ సీట్ల‌లో ప‌వ‌న్ పోటీకి రెడీ అవుతున్నారు. ఆ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఏపీని ఏలుతున్న సామాజ‌క వ‌ర్గంలో పెను ప్ర‌కంప‌నాలు మొద‌ల‌య్యాయి. ఇక కాపు ఓట్లు ఉన్న ప్ర‌తిచోటా ప‌వ‌న్‌కి జ‌నం నీరాజ‌నం ప‌లుకుతున్నారు. ఏపీలో ప్ర‌త్య‌మ్నాయ రాజ‌కీయాలు కావాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. ఆ క్ర‌మంలోనే జ‌నంలోకి వెళుతూ ప‌వ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని తెలుసుకుంటున్నారు.

అయితే ఇటీవ‌ల ప‌వ‌న్‌కి ఊహించ‌ని విధంగా కంటి స‌మ‌స్య ఎదురైంది. ఆ క్ర‌మంలోనే హైదరాబాద్‌లోని ఎల్‌.వి.ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో చికిత్స కోసం ప‌దిరోజుల క్రితం వైద్యులను సంప్ర‌దించారు. తాజాగా శ‌స్త్ర‌చికిత్స పూర్త‌యింద‌ని స‌మాచారం అందింది. ఎడమ కంటిలో కురుపు అయినందున శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో ఉత్తరాంధ్ర యాత్రకు బ్రేక్‌ ఇచ్చి ఆస్పత్రిలో చేరిన ప‌వ‌న్‌కి విజ‌య‌వంతంగా వైద్యులు చికిత్స అందించారు. నాలుగు రోజులు విశ్రాంతి అనంత‌రం తిరిగి త‌న యాత్రల్ని య‌థావిధిగా కొన‌సాగించ‌వ‌చ్చు. పవన్‌ ప్రజా పోరాట యాత్ర 16వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో పునఃప్రారంభం కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments