నా అంత్యక్రియలకు పవన్ రావాలి.. అభిమాని ఆత్మహత్య!

Tuesday, September 4th, 2018, 03:12:35 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత అభిమానాన్ని ఇంకా పెంచుకున్నారనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ వస్తున్నారు అంటే చాలు ఏ మాత్రం ఆలోచించకుండా వెళ్లడం అభిమానుల నైజం. అయితే ఇటీవల ఒక అభిమాని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అనుకోని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఇదివరకు పలు జనసేన కార్యక్రమాల్లో కార్యకర్తగా సేవలందించారు. అతని పేరు కొమరవల్లి అనిల్ కుమార్.

విజయవాడకు చెందిన ఈ యువకుడు జిమ్ లో ట్రయినర్ గా చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తాడు. గత కొంత కాలంగా డిప్రెషన్ లో ఉన్న అనిల్ చనిపోయే ముందు తన ఆత్మహత్య లేఖలో తన మరణాన్నీ పవన్ దృష్టికి తీసుకువెళ్లాలి అని తెలిపాడు. అంతే కాకుండా పవన్ తనను చూడటానికి రావాలని ఆయన చేతుల మీదుగానే తన అంత్యక్రియలు జరగాలని కోరాడు. పవన్ తప్పకుండా వస్తాడనికే భావిస్తున్నట్లు కూడా అనిల్ లేఖలో పేర్కొన్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments