హిందూపూర్ ని టచ్ చేస్తున్న జనసేన..పవన్ కోసం కాదు..!

Thursday, November 9th, 2017, 02:55:34 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయేది అనంతపురం జిల్లా నుంచే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. కానీ పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గం ఏంటనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్సే. కానీ ఆయన అభిమానుల కన్ను మాత్రం హిందూపురంపై పడింది.ఇటీవల సినీనటుడు నరేష్.. పవన్, కమల్ హాసన్ లు ముఖ్యమంత్రులైతే బావుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ వ్యక్తి అయిన నరేష్ ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో జనసేన మద్దత్తు దారులంతా నరేష్ కు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు.

నరేష్ జనసేన పార్టీకి మరింత చేరువ కావాలని కూడా అభిమానులు ఆయన్ని కోరుతున్నారు. దీనికి నరేష్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. కానీ పవన్ అభిమానులు మరో కొత్త ప్రతిపాదన కూడా నరేష్ ముందు ఉంచారు. ఏపీ రాజకీయాల్లో హిందూపురంకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ ఇక్కడినుంచి మూడు సార్లు ప్రాతినిధ్యం వహించారు. గతంలో హరికృష్ణ, ప్రస్తుతం బాలయ్య హిందూపురంని ఎంచుకునే వారే. హిందూపురంలో సినీ గ్లామర్ ఎక్కువగా ఉండడంతో నరేష్ కూడా జనసేన పార్టీలో చేరి ఇక్కడినుంచి పోటీ చేస్తే బావుంటుందని జనసైనికులు హంగామా చేస్తున్నారు. కేవలం పవన్ ముఖ్యమంత్రి అయితే బావుంటుంది అనే కామెంట్ ని ఆయన చేయడం వలనే. కాగా పవన్ కళ్యాణ్ కదిరి నుంచి పోటీ చేసి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిచాలనుకుంటున్నట్లు జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments