పవన్ యాత్ర – జగన్ యాత్ర.. ఒకే చోట అయితే కష్టం?

Friday, July 13th, 2018, 03:55:35 AM IST


ఆంధ్రప్రదేశ్ లో జనసేన నాయకుడు అలాగే ప్రతి పక్ష పార్టీ అధినేత యాత్రలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జగన్ తన పాదయాత్రను కొన్ని నెలల క్రితమే మొదలు పెట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నాడు . వైఎస్ వాడిన సక్సెస్ ఫార్ములా వర్కౌట్ అవుతుందని జగన్ చాలా నమ్మకంగా ఉన్నాడు. అయితే మరోవైపు పవన్ కూడా తన యాత్రలతో మీటింగ్ లతో నిరంతరం జనాలను ఆకర్షిస్తున్నాడు. అభిమానులనే కాకుండా గ్రామా స్థాయి నుంచి ప్రజలను తన మాటలతో ఆకట్టుకుంటున్నాడు.

ఇక అసలు విషయంలోకి వస్తే ఓ వైపు జగన్ మరో వైపు పవన్.. ఇన్ని రోజులు యాత్రలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడిచాయి. అయితే మొదటిసారి ఇద్దరి యాత్రలు క్లాష్ అయ్యే అవకాశం ఏర్పడింది. తూర్పు గోదావరి జిల్లా వరకు జగన్ చేరుకున్నాడు. ఇక నెక్స్ట్ పవన్ కూడా అదే జిల్లాలో తన పర్యటనను ఈ నేల 16 నుంచి కంటిన్యూ చేయాలనీ అనుకుంటున్నాడు. అయితే పోలీసులు ఈ విషయంలో పవన్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఓ వైపు జగన్ యాత్ర కొనసాగుతుండగా పవన్ మీటింగ్ లకు భద్రత కల్పించలేమని పోలీసులు వివరణ ఇవ్వడంతో పవన్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. దీంతో పవన్ తన పర్యటనను పశ్చిమ గోదావరికి షిఫ్ట్ చేసినట్లు సమాచారం. ఈ విషయంపై జనసేన నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments