జేడీ లక్ష్మీనారాయణ మెస్సేజ్ చేశారు: పవన్

Monday, March 26th, 2018, 10:32:17 PM IST

ప్రస్తుత రాజకీయాల్లో మార్పు కోసం తనదైన శైలిలో ముందుకు వెళుతోన్న పవన్ కళ్యాణ్ సమయం వచ్చినప్పుడల్లా తన పార్టీ బలాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే పార్టీలో కొంత మంది సీనియర్ ప్రభుత్వ అధికారులు పవన్ కు మద్దతుగా నిలిచారు. రెగ్యులర్ గా కాకుండా పవన్ డిఫెరెంట్ పాలిటిక్స్ చేస్తున్నాడని చెప్పవచ్చు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇటీవల ఐఏఎస్ లక్ష్మి నారాయణ సడన్ గా వాలంటరీ రిటైర్మెట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నట్లు గత కొంత కాలంగా వార్తలు చాలా వస్తున్నాయి.

ఆ విషయాలపై ఆయన అధికారకంగా స్పందించలేదు. అయితే ఏ పార్టీలో చేరతారు అనే విషయంపై ఆసక్తి రేగుతోన్న సమయంలో పవన్ కళ్యాణ్ ట్విస్ట్ ఇచ్చారు. మాజీ ఐఏఎస్ లక్ష్మి నారాయణ మా పార్టీ లోకి‌ రాబోతున్నట్లు కొన్ని ఊహాగానాలు వచ్చాయి. నేను ఆయనను గతంలో ఒక్కసారి మాత్రమే కలిశాను. మా పార్టీలోకి వస్తాను అంటే తప్పకుండా ఆహ్వానిస్తాం. ఇటీవల జరిగిన ఆవిర్భావ సభకు ముందు నాకు మెస్సేజ్ పెట్టారు. రెండు మూడు సార్లు SMSలు ఎక్స్ చేంజ్ చేసుకున్నామని పవన్ తెలిపాడు. దీంతో దాదాపు వీరి కలయిక ఒకటయినట్లే అని తెలుస్తోంది. ఐఏఎస్ లాంటి అధికారి రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామం. ఇక పవన్ తో కలిస్తే జనసేన పార్టీ మరింత స్ట్రాంగ్ అయినట్టే అని చెప్పవచ్చు.