అందరిని వేడుకుంటున్నా.. ఇంతటితో ఈ విషయాన్నీ వదిలేయండి : పవన్

Thursday, July 26th, 2018, 11:05:48 AM IST

రాజకీయాల్లో ఉండాలంటే శాంతి మార్గంలో వెళితేనే సరిపోదు అనే రాజకీయాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ప్రతి ప్రశ్నకు ధీటైన సమాధానం చెప్పాలి. ఎదురుగా వచ్చే ఇబ్బందులను దైర్యంగా ఎదుర్కోవాలి. పాలిటిక్స్ లో మంచిచేయడానికి మాట వాడటంతో తప్పు లేదని చాలా మంది రాజకీయనాయకులు గుర్తు చేశారు. ఇక సరికొత్త రాజకీయ ప్రణాళికలతో ముందుకు వెళుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తనదైన శైలిలో విమర్శలకు సమాధానాలు చెబుతూ ముందుకు సాగుతున్నారు. రీసెంట్ గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఒక్కసారిగా పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

కార్లను మార్చినంత ఈజీగా పెళ్లాలను మార్చేస్తారని చెప్పడం జనసేన అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించడమే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా తీవ్రంగా ఖండించారు. ఇక పవన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా ధీటుగా జవాబు ఇస్తున్నాడు. వ్యక్తిగత విషయాల్లో తలదూరిస్తే తాము కూడా వెళ్లాల్సి ఉంటుందని ఇప్పటికే జనసేన అధినేతలు కౌంటర్ ఇవ్వగా పవన్ మరోసారి ఈ విషయంపై స్పందించాడు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వ్యక్తిగతంగా విమర్శించిన తీరు చాలా మందికి బాధ కలిగించిందని నా దృష్టికి వచ్చింది. నేను ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లాను. అది రాజకీయ లభ్ది కోసం అసలు వాడను. ప్రజలకు సంబందించిన పబ్లిక్ పాలిసీల మీద మిగతా పార్టీలతో విభేదిస్తాను గాని ఎవరితో వ్యక్తిగత విభేదాలు లేవు. ఈ తరుణంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వారికి సంబందించిన కుటుంబ సభ్యులను గాని ఈ వివాదంలోకి లాగవద్దని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నట్లు చెప్పిన పవన్ ఇంతటితో ఈ విషయాన్నీ వదిలేయాలని తన ట్విట్టర్ ఎకౌంట్ లో పేర్కొన్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments