జిమ్ లో కాటమ రాయుడు..దసరాకి ఫస్ట్ లుక్..?

Tuesday, September 20th, 2016, 03:23:30 PM IST

pawan-kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చి సినిమాలతో బిజీగా మారనున్నాడు.నేడు పవన్ తాజా చిత్రం కాటమ రాయుడు షూటింగ్ ప్రారంభం కాబోతోంది.ఈనెల 24 నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొంటాడు.శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా గోపాల..గోపాల ఫేమ్ కిషోర్ పార్థసాని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

ఇటీవల రాజకీయాలతో బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాటిని కొద్దిరోజులు పక్కనపెట్టి సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు.బాడీ ఫిట్ నెస్ కోసం పవన్ జిమ్ లో తెగ కష్టపడిపోతున్నాడు. ఈ చిత్రం ఫ్యాక్షన్ నేపథ్యం లో తెరకెక్కనుంది.ఇప్పటికే టైటిల్ లోగోని చిత్ర టీం విడుదల చేసింది.దసరాకి ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రంలో పవన్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది.