జ‌న‌సేనానితో ఆప్‌, క‌మ్యూనిస్టులు అల‌యెన్స్‌!

Friday, February 24th, 2017, 02:00:42 AM IST


జ‌న‌సేనాని సైర‌న్ మోగింది! 2019 ఎన్నిక‌ల వార్‌లో వారియ‌ర్‌గా దిగిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు ప‌వ‌న్‌. అందుకు త‌గ్గ‌ట్టే రాజ‌కీయాల్లో హీట్ పెంచేశాడు. ఇప్ప‌టికే ప‌వ‌న్‌పై వ్య‌తిరేక గ‌ళం వినిపించేవాళ్లు ఒక్కొక్క‌రుగా సిద్ధ‌మైపోవ‌డం వెన‌క కార‌ణం కూడా అదే. ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ని ఢీకొట్టాలంటే ఇప్ప‌టినుంచే అత‌డి ప్ర‌భావం త‌గ్గించాలి. త‌గ్గించాలంటే బుర‌ద జ‌ల్లాలి. ఇదే ల‌క్ష్య ంగా కొంద‌రు ఇప్ప‌టికే ఎటాక్ ప్రారంభించారు. సినిమావాళ్ల‌తోనే తిట్టించే ప‌ని పెట్టుకున్నారు మ‌రికొంద‌రైతే. ఈరోజు టీవీచానెళ్ల లైవ్‌లో ప‌వ‌న్‌పై త‌మ్మారెడ్డి అనే అస్త్రాన్ని కొంద‌రు వెన‌క ఉండి న‌డిపించార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఏదైతేనేం ప‌వ‌న్ భ‌యం అంద‌రిలోనూ ఉంద‌న‌డానికి ఇదో ఎగ్జాంపుల్.

అందుకు త‌గ్గ‌ట్టే శ‌త్రువు అంచ‌నాల్ని త‌ల‌కిందులు చేస్తూ ప‌వ‌న్ దూసుకుపోతున్నాడు. మొన్న లండ‌న్ వెళ్లి హార్వార్డ్‌లో ప్ర‌సంగం చేసిన ప‌వ‌న్ అంత‌ర్జాతీయ నిపుణుడి స‌మ‌క్షంలో రాజ‌కీయ ఫార్ములాల్ని ఒంట‌బ‌ట్టించుకున్నారు. ఇప్ప‌టికే ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాలి? అన్న‌దానిపై క్లారిటీకి వ‌చ్చేశాడు. ఇక ఏఏ పార్టీల‌తో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలి? అన్న‌దానిపై ప‌వ‌న్‌కి ఓ అవ‌గాహ‌న ఉంది. త‌న భావ‌జాలంతో ముందుకు వ‌చ్చే చిన్న పార్టీల‌తో పొత్తు పెట్టుకుని 2019 ఎన్నిక‌ల్లో పెద్ద పాత్ర పోషించాల‌న్న‌ది ప‌వ‌న్ ప్లాన్‌. ఎలానూ కాపు యువ‌త‌, కాపు నేత‌ల అండాదండా ప‌వ‌న్‌కి ఉంటుంది. అలాగే ప‌వ‌న్ భావ‌జాలంతో ప‌నిచేస్తున్న జాతీయ పార్టీ ఆప్‌తోనూ జ‌న‌సేనాని పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉంది. అలాగే క‌మ్యూనిస్టుల‌తోనూ ఇప్ప‌టికే ప‌వ‌న్ చెలిమి కొన‌సాగుతోంది. వారి నుంచి త‌మ‌కి మ‌ద్ధ‌తు ఉంది. ఇదంతా చూస్తుంటే ప‌వ‌న్ వైపు అన్ని ప‌రిణామాలు వెళుతున్న‌ట్టే అనిపిస్తోంది. 2019లో ఏం జ‌రిగినా జ‌ర‌గొచ్చు. ఇప్ప‌టికే అధికార తేదేపా పార్టీపై ఏపీ ప్ర‌జ‌లు గుర్రుమీదున్నారు. రాజ‌ధాని నుంచి ప‌ల్లెటూళ్ల వ‌ర‌కూ అదే స‌న్నివేశం. కాబ‌ట్టి ఇక ప‌వ‌న్ హ‌వా సాగినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని విశ్లేషిస్తున్నారు. భాజ‌పా-తేదేపాతో క‌టీఫ్ చేసుకుని 2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ త‌న అల‌యెన్స్‌తో క‌లిసి పోటీ చేయ‌డం ఖాయ‌మైన‌ట్టేన‌ని విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి.